Begin typing your search above and press return to search.

పుష్పకు సడన్ బ్రేక్.. ఎందుకంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత మరింత పవర్ఫుల్ గా పుష్ప 2 సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు

By:  Tupaki Desk   |   2 Dec 2023 4:42 PM GMT
పుష్పకు సడన్ బ్రేక్.. ఎందుకంటే?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత మరింత పవర్ఫుల్ గా పుష్ప 2 సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. దర్శకుడు సుకుమార్ సైతం ఈసారి అంతకుమించి అనేలా పుష్పరాజ్ ను ప్రజెంట్ చేసేందుకు హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పాలిడేస్ కూడా తీసుకోకుండా సండే లు కూడా వర్క్ చేస్తూ సినిమా షూటింగ్ కోసం కష్టపడుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయాలి అని ఒకవైపు సుకుమార్ మరొకవైపు అల్లు అర్జున్ బలంగా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా అప్పుడప్పుడు అభిమానులను ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. చాలా రోజులుగా పుష్ప 2 సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. రీసెంట్గా అయితే వారం రోజులు గ్యాప్ లేకుండా కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక పాట చిత్రీకరణ కూడా జరిగింది.

అయితే ఇప్పుడు హఠాత్తుగా షూటింగ్ కు బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. మళ్లీ డిసెంబర్ 2వ వారం నుంచి కొనసాగించే విధంగా నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఎందుకంటే అల్లు అర్జున్ వెన్నునొప్పితో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఇక ముందు జాగ్రత్తగా రెస్టు తీసుకుంటే బెటర్ అని షూటింగ్ కు బ్రేక్ ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

మళ్లీ వీలైనంత త్వరగా కోలుకొని షూటింగ్లో పాల్గొనాలని కూడా బన్నీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక వారం గ్యాప్ ఇచ్చి మల్లి డిసెంబర్ రెండో వారం షూటింగ్లో వేగాన్ని పెంచాలని మైత్రి నిర్మాతలకు బన్నీ సూచించినట్లు సమాచారం. రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను అయితే నిర్మిస్తున్నారు. ఇక 2024 ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

పుష్ప ఫస్ట్ పార్ట్ కంటే ఈసారి సెకండ్ పార్ట్ అంతకుమించి అనేలా ఉంటుంది అని కూడా చిత్ర యూనిట్ ఒక మంచి నమ్మకాన్ని అయితే కలిగిస్తోంది. ఇక మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి ఈసారి ప్రమోషన్స్ కోసం కూడా స్పెషల్ ప్లాన్ వేయాలని అనుకుంటున్నారు. అప్పట్లో ఫస్ట్ పార్ట్ సమయంలో ప్రమోషన్స్ కు ఎక్కువ సమయాన్నీ కేటాయించలేకపోయారు. ఇక ఇప్పుడు మాత్రం అలాంటి ఇబ్బంది లేకుండా సినిమా షూటింగ్ ముందుగానే చేయబోతున్నారు.