Begin typing your search above and press return to search.

'పుష్ప2'.. రజినీకాంత్ ని మించి బన్నీ రెమ్యూనరేషన్?

పాన్ ఇండియా ట్రెండ్ వచ్చినప్పటి నుంచి అగ్ర హీరోల రెమ్యూనరేషన్స్ ఏ రేంజ్ లో ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By:  Tupaki Desk   |   26 Nov 2023 10:29 AM GMT
పుష్ప2.. రజినీకాంత్ ని మించి బన్నీ రెమ్యూనరేషన్?
X

పాన్ ఇండియా ట్రెండ్ వచ్చినప్పటి నుంచి అగ్ర హీరోల రెమ్యూనరేషన్స్ ఏ రేంజ్ లో ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య యంగ్ హీరోలు కూడా సినిమా బ్లాక్ బస్టర్ అయితే వెంటనే పారితోషకాలు పెంచేస్తున్నారు. ఈ రెమ్యూనరేషన్స్ విషయంలో మరో కొత్త ట్రెండ్ కూడా వచ్చింది. అదేంటంటే పారితోషికం కింద లాభాల్లో వాటా తీసుకోవడం. ఈమధ్య కొందరు స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ కింద లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు.

తాజాగా ఈ లిస్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయారు. పుష్ప: ది రైజ్ మూవీతో ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడం తోపాటు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ 'పుష్ప 2' కోసం గట్టిగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మైత్రి నిర్మాతలు ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్ పెడుతున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

పార్ట్-1 కి వచ్చిన సక్సెస్ ని చూసి పుష్ప 2 ని పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం బన్నీ తన రెమ్యునరేషన్ ని ఒక ఫిగర్ లాగా కాకుండా వచ్చే రెవెన్యూలో పర్సంటేజ్ లాగా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దాని ప్రకారం 'పుష్ప 2' కి జరిగే బిజినెస్ లో 33% అల్లు అర్జున్ కి ఇచ్చేలా అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయిందట.

అంటే ఉదాహరణకు 'పుష్ప 2' థియేటర్, ఓటీటీ, శాటిలైట్, ఆడియో, డిజిటల్, డబ్బింగ్ అన్ని కలుపుకొని మొత్తం వెయ్యి కోట్ల బిజినెస్ చేస్తే అందులో 33% అంటే 300 కోట్లకు పైగా బన్నీ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. ఇదే కనుక నిజమైతే ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా బన్నీ టాప్ ప్లేస్ కి చేరడం ఖాయం. ఇప్పటివరకు సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక్క సినిమా కోసం రూ.210 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అంటే 'పుష్ప2' తో బన్నీ రజనీకాంత్ రికార్డు బ్రేక్ చేయడం గ్యారెంటీ.

ప్రస్తుతం ఈ విషయంపై అధికారిక సమాచారం లేనప్పటికీ మెగా, అల్లు వర్గాల్లో దీని గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇక 'పుష్ప2' పై కూడా ఓ రేంజ్ లో హైప్ నెలకొంది. కాబట్టి సినిమా బిజినెస్ కూడా భారీగా ఉండబోతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాకి ఉన్న డిమాండ్ అంతా కాదు. పార్ట్-1 రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో పుష్ప2 కోసం నార్త్ బయ్యర్లు క్యూ కడుతున్నారు. రిలీజ్ కి ఇంకా టైం ఉండడంతో నిర్మాతలు ఇంకా బిజినెస్ డీల్స్ క్లోజ్ చేయలేదు.