Begin typing your search above and press return to search.

పుష్ప కి అందరూ సైడ్ ఇవ్వాల్సిందే..!

చ్చే ఏడాది ఆరంభంలోనో లేదా సమ్మర్‌ లోనో విడుదల అవుతుందని భావించిన పుష్ప 2 ఆగస్టు లో విడుదల కాబోతున్నట్లు గా ప్రకటన రావడంతో అభిమానులు ఉసూరు మంటున్నారు

By:  Tupaki Desk   |   12 Sep 2023 10:27 AM GMT
పుష్ప కి అందరూ సైడ్ ఇవ్వాల్సిందే..!
X

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఎదురు చూస్తున్న సమయంలో వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. వచ్చే ఏడాది ఆరంభంలోనో లేదా సమ్మర్‌ లోనో విడుదల అవుతుందని భావించిన పుష్ప 2 ఆగస్టు లో విడుదల కాబోతున్నట్లు గా ప్రకటన రావడంతో అభిమానులు ఉసూరు మంటున్నారు.

పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్‌ కి ఇంకా ఏడాది సమయం ఉంది. ఏడాది ముందే విడుదల తేదీని ప్రకటించిన కూడా పోటీ అనేది తప్పదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్‌ లో అజయ్ దేవగన్ హీరోగా రూపొందబోతున్న సింగం 3 సినిమా తో పుష్ప 2 సినిమా ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

కమర్షియల్‌ చిత్రాల దర్శకుడు రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగన్‌ కాంబోలో రూపొందబోతున్న సింగం 3 ను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన నేపథ్యం లో పుష్ప 2 సినిమా పై ఎంత ప్రభావం ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పుష్ప కి ఎదురు వచ్చే వారికే నష్టం తప్పదు.

పుష్ప సినిమాకు జాతీయ అవార్డుల పంట పండటం తో పాటు మొదటి భాగం ఏకంగా రూ.400 కోట్ల వసూళ్లు నమోదు చేసిన నేపథ్యం లో సీక్వెల్‌ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కనుక పుష్ప 2 సినిమా కి భారీ ఓపెనింగ్‌ దక్కే అవకాశాలు ఉన్నాయి. చాలా ఈజీగా ఇతర సినిమాలను బీట్ చేసి మరీ పుష్ప దూసుకు పోతాడు.

ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 సినిమా కు పోటీగా ఎంతటి సినిమా వచ్చినా కూడా ఆ సినిమా లకే డ్యామేజీ అన్నట్టు కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక పుష్ప 2 సినిమా కు పోటీ రాకుండా హిందీ సినిమాలతో పాటు సౌత్ సినిమాలు కూడా వారం అటు లేదా ఇటు గా వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.