Begin typing your search above and press return to search.

పుష్ప 2 జాతర గెటప్.. దేవి లీక్స్

ఇప్పటికే కొన్ని లీక్స్ ద్వారా సినిమా హై రేంజ్ లో ఉండబోతోంది అని నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేలా సుమారు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   21 Nov 2023 10:15 AM GMT
పుష్ప 2 జాతర గెటప్.. దేవి లీక్స్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 1 ద్వారా ఏ స్థాయిలో గుర్తింపు అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డు కూడా రావడంతో ఇప్పుడు రాబోయే సెకండ్ పార్ట్ పై అంతకుమించి అనేలా అంచనాలు పెరిగిపోయాయి. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమాను వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


అయితే ఈ సినిమా మేకింగ్ విషయంలో సుకుమార్ తీసుకున్న జాగ్రత్తలు అన్ని ఇన్ని కాదు అని తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని లీక్స్ ద్వారా సినిమా హై రేంజ్ లో ఉండబోతోంది అని నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేలా సుమారు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఒక విధంగా జాతీయ అవార్డు రావడంతో పుష్ప యూనిట్ పై మరింత బాధ్యత పెరిగింది.

బెస్ట్ అవుట్ పుట్ వచ్చేది తెలుగులో వెయ్యి కోట్ల మార్కెట్ ను అందుకునేలా చేయాలని ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక రీసెంట్గా దేవిశ్రీప్రసాద్ అందించిన మరొక లీక్ ద్వారానే సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. గంగమ్మ తల్లి జాతర సీన్ ఈ సినిమాలో చాలా హైలైట్ గా ఉండబోతుంది అని ఆ సీన్లో గంగమ్మ తల్లి గెటప్ లో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ పుష్ప 2 కే హైలైట్.. అవుతుంది అని దేవిశ్రీప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.

దీంతో ఒక్కసారిగా ఈ విషయం సోషల్ మీడియాలో కూడా మరింత వైరల్ గా మారిపోయింది. అల్లు అర్జున్ ఆ రేంజ్ లో కష్టపడ్డాడు అంటే దానికి తగ్గట్టుగా దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. మొత్తానికి ఈ సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయాలి అని సుకుమారి దేవి అల్లు అర్జున్ కాంబినేషన్ కసిగా కనిపిస్తోంది.

ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో జాతర సీన్స్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను పూర్తి చేశారు. ఇక షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసిన్ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక పుష్ప 2 సినిమాను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.