Begin typing your search above and press return to search.

పుష్ప 2 స్పెషల్ ఐటం ఎవరు..?

ఆగష్టులో రిలీజ్ కాబోతున్న పుష్ప 2 అప్డేట్స్ పై అల్లు ఫ్యాన్స్ తో పాటుగా పుష్ప సినిమా లవర్స్ అంతా కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు

By:  Tupaki Desk   |   17 Jan 2024 6:31 AM GMT
పుష్ప 2 స్పెషల్ ఐటం ఎవరు..?
X

ఆగష్టులో రిలీజ్ కాబోతున్న పుష్ప 2 అప్డేట్స్ పై అల్లు ఫ్యాన్స్ తో పాటుగా పుష్ప సినిమా లవర్స్ అంతా కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. పుష్ప రాజ్ వీర విన్యాసం తెర మీద చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు. వేర్ ఈజ్ పుష్ప అంటూ ఆమధ్య వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను డబుల్ చేసింది. టీజర్ చివర్లో ఇది పుష్ప గాడి రూల్ అంటూ పుష్ప రాజ్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించేశాడు. సినిమాలో హీరో పాత్రకు ఆడియన్ కనెక్ట్ అయితే సినిమా హిట్ అయినట్టే లెక్క. పుష్ప రాజ్ పాత్రకు సౌత్ ఆడియన్స్ కాదు బీ టౌన్ ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఆ క్యారెక్టర్ వారికి బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప హిందీ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది.

పుష్ప 2 కూడా అదే రేంజ్ లో ఫలితాన్ని రాబట్టాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 1 లో స్పెషల్ ఐటం సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఉ అంటావా మావ ఉ ఉ అంటావా అని సమంత చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. పుష్ప 2 లో కూడా అదే రేంజ్ పాటని ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. మళ్లీ సమంతనే పుష్ప 2 లో స్పెషల్ ఐటం కి తీసుకోవాలని అనుకున్నారట. అయితే సమంత అందుకు ఆసక్తిగా లేదని టాక్.

పుష్ప 2 స్పెషల్ సాంగ్ ఛాన్స్ కోసం బాలీవుడ్ భామలు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పాన్ ఇండియా మోస్ట్ ఎవైటెడ్ మూవీలో ఐటం సాంగ్ అంటే దుమ్ము దులిపేయడం ఖాయం. అందుకే సమంత ప్లేస్ లో ఆడిపాడేందుకు భామలు ఆసక్తి చూపిస్తున్నారు. పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం దిశా పటాని ఓకే అన్నట్టు టాక్. ఆమె కాదు బీ టౌన్ హా**ట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా కూడా ఈసారి ఉ అనేందుకు రెడీ అంటుందట. ఐతే మేకర్స్ మాత్రం పుష్ప 2 లో ఈ స్పెషల్ సాంగ్ ప్లానింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారట.

మాస్ ఆడియన్స్ ని మెప్పించే ఈ స్పెషల్ ఐటం సాంగ్స్ విషయంలో సుకుమార్ కి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఆర్యలో అ అంటే అమలాపురం నుంచి పుష్ప 1 లో ఉ అంటావా వరకు తను తీసే సినిమా కథను బట్టి ఆ సాన్ ప్లానింగ్ ఉంటుంది. పుష్ప 2 తో మరోసారి ఆ రేంజ్ హంగామా చేయాలని చూస్తున్నాడు సుకుమార్. దేవి ట్యూన్.. బన్నీ డ్యాన్స్ తో పుష్ప 2 లో సాంగ్ ని కూడా బ్లక్ బస్టర్ చేసేలా చూస్తున్నారు. మరి పుష్ప 2 సాంగ్ ఉ అంటావాని మించిపోతుందా లేదా అన్నది సినిమా వస్తేనే చెప్పగలం.