Begin typing your search above and press return to search.

పుష్ప 2 బ్లాస్ట్.. ఈ మాత్రం ఉండాలి!

ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలు కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   14 March 2024 4:32 AM GMT
పుష్ప 2 బ్లాస్ట్.. ఈ మాత్రం ఉండాలి!
X

అల్లు అర్జున్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనులు అయితే గ్యాప్ లేకుండా కొనసాగుతూ ఉన్నాయి.

ఆలస్యం జరిగితే మాత్రం వాయిదా పడే అవకాశం ఉందని కూడా ఆ మధ్య చాలా రకాల గాసిప్స్ అయితే వచ్చాయి. కానీ నిర్మాణ సంస్థ మాత్రం ఆ వార్తలపై కౌంటర్ ఇచ్చే విధంగా అప్పుడప్పుడు పోస్టర్స్ కూడా విడుదల చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని అనుకుంటూ ఉన్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలు కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఊహించిన స్థాయిలో ఉంటాయి అని అర్థమవుతుంది. అంతేకాకుండా క్యారెక్టర్స్ మొదటి పార్ట్ లో కంటే కూడా రెండవ పార్ట్ లో మరింత పవర్ఫుల్ గా కనిపిస్తాయని తెలుస్తోంది. ఇక స్పెషల్ ఐటెం సాంగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందట.

ఈసారి కూడా సమంతను మరోసారి స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దేవి స్పెషల్ సాంగ్ కు సరైన ట్యూన్ సిద్ధం చేసి ఉంచినట్లు సమాచారం. సెకండ్ హాఫ్ లో సామ్ స్పెషల్ సాంగ్ హైలెట్ కానుందట. ఇక బాలీవుడ్ ప్రముఖ స్టార్ సంజయ్ దత్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో సంజయ్ దత్ ఇంటర్నేషనల్ డాన్ గా కనిపిస్తాడని తెలుస్తోంది.

ఇక అదే క్యారెక్టర్ మూడో పార్ట్ కు కొనసాగింపుగా లీడ్ తీసుకుంటుంది అని సమాచారం. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ తో సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు హై వోల్టేజ్ డ్రామా అలాగే పవర్ఫుల్ క్యారెక్టర్స్ తో పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బ్లాస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది.

ఏ విషయంలోను తగ్గకుండా నిర్మాతలు గట్టిగానే ఖర్చు చేస్తున్నారు. ఇక సుకుమార్ ప్రతి సన్నివేశాన్ని హైలైట్ చేసే విధంగా కష్టపడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ ను త్వరలోనే విడుదల చేయాలని ఆలోచనతో ఉన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆరోజు పుష్ప 2కి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.