Begin typing your search above and press return to search.

పుష్ప-2.. అసలైందే ఉండకపోవచ్చు..

ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉందా? అంటే అది పుష్ప-2 అనే కచ్చితంగా చెప్పాలి.

By:  Tupaki Desk   |   15 April 2024 6:03 AM GMT
పుష్ప-2.. అసలైందే ఉండకపోవచ్చు..
X

ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉందా? అంటే అది పుష్ప-2 అనే కచ్చితంగా చెప్పాలి. లెక్కల మాస్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పై సినీ ప్రియులతో పాటు ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో రెండో భాగంపై నార్త్ టు సౌత్ సూపర్ బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

ఇటీవల విడుదలైన పుష్ప-2 టీజర్.. సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది. దీంతో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సినీ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. టీజర్ లో బన్నీ మేనరిజం, జాతర సీక్వెన్స్ చూస్తుంటే.. సినిమా వేరే లెవల్ లో ఉండనున్నట్లు అర్ధమవుతోంది. టీజర్ లో కనిపించిన సీన్.. ఇంటర్వెల్ కు ముందు ఉండనున్నట్లు తెలుస్తోంది.

అయితే 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప మూవీలో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఎంతలా అలరించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ డైలాగ్ వినిపిస్తూనే ఉంది. అంతలా ఈ డైలాగ్ మార్క్ క్రియేట్ చేసుకుంది. సినీ సెలబ్రిటీల తోపాటు సోషల్ మీడియా యూజర్లు.. ఈ డైలాగ్ ను ఇన్ స్టా రీల్స్ లో ఇప్పటికీ ఉపయోగిస్తుంటారు.

ఇప్పుడు ఈ ఫేమస్ డైలాగ్.. పుష్ప-2లో ఉండదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. టీజర్ లో వినిపించిన హుప్ ను తగ్గేదేలే డైలాగ్ తో మేకర్స్ రీప్లేస్ చేశారని వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్ లో బన్నీ.. తగ్గేదేలే కాకుండా అస్సలు తగ్గేదేలే డైలాగ్ పుష్ప-2లో ఉన్నట్లు ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. దీంతో ఫ్యాన్స్ అప్పట్లో ఫుల్ ఖుషీ అయ్యారు. సినిమాతోపాటు వసూళ్లలో కూడా ఎక్కడా తగ్గకూడదంటూ సందడి చేశారు.

అయితే ఇప్పుడీ వార్త విని కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజం కాదని కొందరు అంటున్నారు. సాలిడ్ గా రీచ్ అయిన డైలాగ్ ను పక్కనపెట్టి ఉండరని చెబుతున్నారు. వేరే డైలాగ్ పెట్టినా అది ప్రేక్షకులకు నచ్చుతుందో లేదే చెప్పలేమని కామెంట్లు పెడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమా.. ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమాలో తగ్గేదేలే డైలాగ్ ఉందో లేదో అప్పుడే తెలుస్తుంది.