Begin typing your search above and press return to search.

పుష్ప 2 ఆడియో రైట్స్.. ఫ్యూజులు ఎగిరిపోయేలా..!

ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీలో ఒకటైన పుష్ప 2 పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   12 April 2024 7:29 AM GMT
పుష్ప 2 ఆడియో రైట్స్.. ఫ్యూజులు ఎగిరిపోయేలా..!
X

ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీలో ఒకటైన పుష్ప 2 పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. పుష్ప 2 సినిమాపై ఆడియన్స్ ఎంత క్యూరియాసిటీతో ఉన్నారన్నది ఆ సినిమా ప్రతి అప్డేట్ కి వచ్చే లైకులు, వ్యూస్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా పుష్ప 2 నుంచి వచ్చిన చిన్న టీజర్ మరింత క్రేజ్ సంపాదించింది. పుష్ప రాజ్ పాత్రను పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ అంతా ఓన్ చేసుకున్నారు. అందుకే సినిమా ప్రతి అప్డేట్ మిలియన్ల కొద్దీ క్రేజ్ తెచ్చుకుంటుంది.

పుష్ప 2 సినిమా పై ఉన్న ఈ అంచనాలు సినిమా బిజినెస్ పై ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సినిమా కోసం ఇప్పటికే నార్త్ సైడ్ భారీ రేంజ్ లో బిజినెస్ ఆఫర్లు వస్తుండగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ విషయంలో కూడా నెక్స్ట్ లెవెల్ డిమాండ్ ఏర్పడింది. ఇక లేటెస్ట్ గా పుష్ప 2 ఆడియో రైట్స్ ను టీ సీరీస్ భారీ ధరకు కొనేసినట్టు తెలుస్తుంది. పుష్ప 2 అన్ని భాషల ఆడియో రైట్స్ ను టీ సీరీస్ 60 కోట్ల మొత్తం తో దక్కించుకున్నారట.

సినిమా ఆడియో రైట్స్ కే ఈ రేంజ్ డిమాండ్ అన్నది అది కేవలం పుష్ప 2కే అని చెప్పొచ్చు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా దానికి కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 మరో సెన్సేషన్ గా మారేందుకు సిద్ధంగా ఉంది. ఆడియన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా థియేటర్ లో వారిని సాటిస్ఫై చేసేలా సుకుమార్ ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది. సినిమా ఆడియో రైట్స్ కే ఈ రేంజ్ డిమాండ్ ఉంది అంటే ఇక థియేట్రికల్ బిజినెస్ లెక్క ఒక రేంజ్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. ఆగష్టు 15న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 బాక్సాఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది చూడాలి.

పుష్ప 2 లో పుష్ప రాజ్ మరోసారి పూనకాలు తెప్పించేలా ఉన్నాడని ప్రచార చిత్రాలు చూస్తేనే అర్థమవుతుంది. పుష్ప 1 తోనే నేషనల్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ పార్ట్ 2 కోసం విశ్వరూపం చూపిస్తాడని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా పుష్ప 1 ను మించి పుష్ప 2 ఉంటుందని అంటున్నారు. సినిమా పవర్ ప్యాక్డ్ గా తీర్చిదిద్దడంలో చిత్ర యూనిట్ కృషి చేస్తున్నారు.