'పుష్ప' రికార్డ్‌ను 'పుష్ప 2' బ్రేక్ చేసేనా?
ప్రముఖ తెలుగు శాటిలైట్ ఛానల్ పుష్ప 2 సినిమా టెలికాస్ట్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 8 April 2025 11:28 AM ISTఅల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' ప్రాంచైజీ రెండు పార్ట్‌లు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పుష్ప 2' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డ్‌లు అన్నీ ఇన్నీ కావు. బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.1900 కోట్ల వసూళ్లు రాబట్టిన పుష్ప 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌లోనూ సంచలనం సృష్టించింది. తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్‌ను నమోదు చేయడంతో పాటు, ఎక్కువ వ్యూ అవర్స్‌ను నమోదు చేసిన సినిమాగాను పుష్ప 2 రికార్డ్‌లు దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్‌లో ఇండస్ట్రీ హిట్ అందుకున్న పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్‌లోనూ అదే స్థాయిలో నెంబర్స్‌ను నమోదు చేసింది. ఇప్పుడు టెలివిజన్ టెలికాస్ట్‌కి సిద్ధం అవుతోంది.
ప్రముఖ తెలుగు శాటిలైట్ ఛానల్ పుష్ప 2 సినిమా టెలికాస్ట్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. సినిమా విడుదల అయ్యి నాలుగు నెలలు కావస్తున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా పుష్ప అంటే నీ అవ్వ తగ్గేదేలే అంటూ డైలాగ్స్ వినిపిస్తున్నాయి. పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక కిస్సిక్ సాంగ్ వేడి ఏమాత్రం తగ్గలేదు. శ్రీవల్లి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. పుష్ప 2 కలెక్షన్స్ గురించి రాబోయే ఏడాది కాలం పాటు మాట్లాడుకుంటూనే ఉంటాం. కనుక పుష్ప 2 థియేట్రికల్ రిలీజ్ అయిన ఇన్ని రోజులకు శాటిలైట్ టెలికాస్ట్ కాబోతున్నప్పటికీ కచ్చితంగా భారీ రేటింగ్ నమోదు కావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మారిన పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నాళ్లుగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత శాటిలైట్ టెలికాస్ట్‌కి ఎక్కువ రేటింగ్ నమోదు చేయలేక పోతున్నాయి. ఒకప్పుడు దాదాపుగా 30 రేటింగ్ నమోదు చేసిన సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలోనే ఎక్కువ మంది చూస్తున్న కారణంగా శాటిలైట్ టెలికాస్ట్ సమయంలో 20 రేటింగ్ కూడా నమోదు కావడం లేదు. దాంతో ఈ మధ్య శాటిలైట్ బిజినెస్ చాలా తగ్గింది. అయితే పుష్ప 2 సినిమాకు కచ్చితంగా భారీ రేటింగ్ నమోదు అవుతుంది అనే విశ్వాసంను అల్లు అర్జున్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టెలికాస్ట్ గురించి స్టార్ మా తెగ ప్రచారం చేస్తుంది.
పుష్ప సినిమాకు ఆ సమయంలో 20కి మించి రేటింగ్ నమోదు అయింది. ఈమధ్య కాలంలో ఎంతటి సూపర్ హిట్ సినిమాలు అయినా ఓటీటీ స్క్రీనింగ్ తర్వాత టెలికాస్ట్ అయితే రేటింగ్ తక్కువ నమోదు అవుతుంది. మరి పుష్ప 2 సినిమా ఏ స్థాయిలో రేటింగ్ దక్కించుకుంటుందా అనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తం అవుతోంది. పుష్ప పార్ట్ 1 రికార్డ్‌ను పుష్ప పార్ట్ 2 బ్రేక్ చేస్తే కచ్చితంగా అతి పెద్ద రికార్డ్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ పుష్ప 2 సినిమాకు ఆ స్థాయిలో రేటింగ్ నమోదు కాకపోవచ్చు అని, థియేట్రికల్ రిలీజ్ సూపర్ హిట్ కావడంతో పాటు, ఓటీటీ స్ట్రీమింగ్‌కి మంచి స్పందన దక్కించుకున్న కారణంగా 15కి మంచి రేటింగ్ అయితే బెస్ట్ రేటింగ్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. స్టార్ మాలో పుష్ప 2 ను ఏప్రిల్ 13న స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
