హిమాచల్ ప్రదేశ్ లో పుష్ప సీన్ రిపీట్..!
లేటెస్ట్ గా హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా చెట్లు విరిగి ఒక వాగులో కొట్టుకుంటూ వచ్చాయి. ఆ వీడియోని తీసి పుష్ప రాజ్ అంటూ అక్కడి ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
By: Tupaki Desk | 27 Jun 2025 12:49 AM ISTఅల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా రెండు భాగాలు సూపర్ హిట్ అందుకున్నాయి. పుష్ప 1 తో అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా సాధించాడు. పుష్ప 2 తో కూడా సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ టేకింగ్, అల్లు అర్జున్ యాక్టింగ్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇలా అన్నీ సమపాళ్లలో కుదిరాయి. అందుకే పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బ్రహ్మాండాలు సృష్టించింది. ఈ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే సినిమా వచ్చి చాలా కాలం అవుతున్నా ఇంకా అక్కడ ఆడియన్స్ పుష్ప రాజ్ పేరు మర్చిపోలేదు.
లేటెస్ట్ గా హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా చెట్లు విరిగి ఒక వాగులో కొట్టుకుంటూ వచ్చాయి. ఆ వీడియోని తీసి పుష్ప రాజ్ అంటూ అక్కడి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చెరువులో చెట్లు కొట్టుకొస్తుంటే పుష్ప రాజ్ గుర్తొచ్చాడు అంటే అల్లు అర్జున్, సుకుమార్ ఎంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అర్ధం చేసుకోవచ్చు.
పుష్ప 1, 2 మాత్రమే కాదు పుష్ప 3 కూడా ఉంటుందని సుకుమార్ షాక్ ఇచ్చాడు. ఐతే పుష్ప 1, 2 రెండు వరుసగా తీసిన సుకుమార్ పుష్ప 3కి మాత్రం గ్యాప్ తీసుకుని చేయాలని ఫిక్స్ అయ్యాడు. పుష్ప 3 సినిమాకు ముందు అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా తో పాటు మరో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఐతే బీ టౌన్ ఆడియన్స్ మాత్రం అల్లు అర్జున్ త్వగా పుష్ప 3వ భాగం కూడా చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ ఆడియన్స్ కి ట్రీట్ ఇచ్చింది.
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమాపై ఇప్పటికే సూపర్ బజ్ ఏర్పడింది. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ హీరో మూవీగా రాబోతుందని తెలుస్తుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ డైరెక్టర్స్ లిస్ట్ లో సందీప్ వంగ, కొరటాల శివ కూడా ఉన్నారు.
