Begin typing your search above and press return to search.

శ్రీవల్లి లేని పుష్పని జనాలు చూస్తారా..?

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప రెండు భాగాలు రికార్డులు సృష్టించాయి.

By:  Tupaki Desk   |   25 April 2025 3:30 AM
శ్రీవల్లి లేని పుష్పని జనాలు చూస్తారా..?
X

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప రెండు భాగాలు రికార్డులు సృష్టించాయి. పుష్ప 1 ఒక రేంజ్ లో సక్సెస్ కాగా పుష్ప 2 పాన్ ఇండియా రికార్డులు కొల్లగొట్టింది. అల్లు అర్జున్ పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ పార్ట్ 1 కే నేషనల్ అవార్డ్ వచ్చేలా చేయగా పుష్ప 2 సినిమాతో కూడా మరోసారి అవార్డ్ గ్యారెంటీ అనిపించేశాడు. ఇక పుష్ప రెండు భాగాల్లో రష్మిక కూడా అదరగొట్టేసింది.

శ్రీవల్లి పాత్రలో అమ్మడి యాక్టింగ్ సూపర్ అనిపించేసింది. ముఖ్యంగా పుష్ప 2 లో ఒక లెంగ్తీ డైలాగ్ లో అదరగొట్టేసింది రష్మిక. అంతేనా సాంగ్స్ లో అల్లు అర్జున్ కి ధీటుగా డ్యాన్స్ తో ఇంప్రెస్ చేసింది రష్మిక. ఐతే పుష్ప 2 చివర్లో పాత్రలన్నిటినీ ముగించేశాడు సుకుమార్. ఫ్యామిలీని మొత్తం బ్లాస్టింగ్ లో లేపేశారు. కేవలం పుష్ప రాజ్ ఒక్కడే మిగులుతాడు.

మిగతా కథ అంతా అంటే పార్ట్ 3 అంతా కూడా అల్లు అర్జున్ ఒక్కడే నడిపిస్తాడు. పుష్ప పార్ట్ 3 ర్యాంపేజ్ లో శ్రీవల్లి కూడా ఉండటం కష్టమని చెప్పొచ్చు. సో హీరోయిన్ పాత్ర మూడో భాగం లో ఉండే ఛాన్స్ లేదు. ఒకవేళ పుష్ప 3 లో కొత్త హీరోయిన్ ని ఎవరినైనా తీసుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది. పుష్ప 3 విషయంలో సుకుమార్ ఆలోచన ఏంటి అతను ఏం చేయాలని అనుకుంటున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ తో సినిమా లాక్ చేసుకున్నాడు. ఈ సినిమా రెండేళ్లలో పూర్తి చేసి ఆ తర్వాత పుష్ప 3 కి రెడీ అయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. పుష్ప 2 టైం లోనే పుష్ప 3 కి దాచిన రష్ అంతా అలానే ఉంది. ఈలోగా సుకుమార్ కూడా రాం చరణ్ తో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. మరి పుష్ప 3 కోసం ఆడియన్స్ ని వెయిటింగ్ చేయించేలా ఉన్నారు ఈ టీం. ఆమధ్య ఒక ఈవెంట్ లో 2028 లో పుష్ప 3 వస్తుందని నిర్మాత అన్నారు. కానీ అది సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించట్లేదు.