పుష్ప 2: సుకుమార్ తెలివైన మోసం.. వీడియో వైరల్
ఈ వీడియో చూసిన ప్రేక్షకులు, “ఇంతవరకు అసలు ఇది వీఎఫ్‌ఎక్స్ అనిపించలేదు, ఇప్పుడు చూశాకే అర్థమవుతోంది” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 18 April 2025 12:01 PMఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్‌ను వణికిస్తూ 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి కొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజయం వెనుక భారీ విజువల్స్, నెవర్ బిఫోర్ లెవెల్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా విడుదలైన ఓ బీహైండ్ ది సీన్స్ వీడియో మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిచింది.
సినిమాలో కనిపించిన అడవులు, బోటింగ్ ఎపిసోడ్, జపాన్ ఫైట్ సీన్, మాల్దీవుల్లో జరిగిన డీలింగ్ లాంటి ముఖ్యమైన సన్నివేశాలన్నీ వాస్తవంగా తీసినవి కాదట. అవన్నీ వీఎఫ్‌ఎక్స్ ద్వారా క్రియేట్ చేసినవేనని సుకుమార్ రైటింగ్స్ సంస్థ విడుదల చేసిన వీడియోలో స్పష్టమవుతోంది. ఇందులో గ్రీన్ మ్యాట్ మీద స్టూడియోలో నటీనటులు నటించి, ఆ తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా అద్భుతమైన విజువల్స్‌గా మలిచిన విధానం చూపించారు.
ఈ వీడియో చూసిన ప్రేక్షకులు, “ఇంతవరకు అసలు ఇది వీఎఫ్‌ఎక్స్ అనిపించలేదు, ఇప్పుడు చూశాకే అర్థమవుతోంది” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “అసలు రియల్ లొకేషన్లలోనే షూట్ చేశారనుకున్నాం... కానీ ఇది మొత్తం మాయాజాలమా!” అని కామెంట్లు పెడుతున్నారు. నిజానికి తెరపై వచ్చిన ఫినిషింగ్ లెవెల్ అంత రియలిస్టిక్‌గా ఉండటంతో ఎవ్వరికీ దీనిపై డౌట్ రాలేదు.
సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు ఇది మరో ఉదాహరణ అని చెప్పాలి. ఆయన టెక్నాలజీని ఎలా అద్భుతంగా వినియోగించాలో చూపించి, ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామా అయినా కూడా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు. ఆయన చాలా తెలివిగా మోసం చేశారంటూ మరికొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. పుష్ప 2ను దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయికి తీసుకెళ్లిన కారణాల్లో ఇది ఒకటి.
ఇప్పటికే సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచినప్పటికీ, ఇప్పుడు ఈ వీఎఫ్‌ఎక్స్ వీడియోతో సినిమాపై ఇంకొంచెం ఎక్కువ గౌరవం ఏర్పడుతోంది. "ఇది కచ్చితంగా ఇండియన్ సినిమా టెక్నాలజీకి గర్వకారణం" అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్పరాజ్ క్యారెక్టర్ నుంచి ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం దాకా అన్నీ కంప్యూటర్ ద్వారా రూపొందించబడటమే ఒక్కసారిగా ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.
మొత్తానికి పుష్ప 2 ప్రేక్షకులపై మాయాజాలం క్రియేట్ చేసినట్టు కనిపిస్తోంది. థియేటర్లలో చూసినప్పుడు అసలు వీఎఫ్‌ఎక్స్ ఉందన్న ఫీల్ రాకుండా సజీవంగా అనిపించడం చిత్రబృందం ప్రతిభకు అద్దం పడుతుంది. ఇప్పుడైనా ఈ బీహైండ్ ద సీన్స్ వీడియో చూసి, అలాంటి విజువల్స్ వెనుక ఉన్న కృషిని గుర్తించాలి. నిజంగా పుష్ప 2 ఒక విజువల్ అండ్ టెక్నికల్ మాస్టర్ పీస్ అని మరోసారి నిరూపితమైంది.