Begin typing your search above and press return to search.

డిజాస్టర్ సినిమాకు దగ్గరగా పుష్ప 2 TRP!

అయితే తాజాగా ఈ చిత్రం టెలివిజన్‌లో ప్రసారం అయిన తర్వాత వచ్చిన టీఆర్పీ రేటింగ్ కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది.

By:  Tupaki Desk   |   24 April 2025 1:30 PM
డిజాస్టర్ సినిమాకు దగ్గరగా పుష్ప 2 TRP!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప 2' బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. విడుదలైన వెంటనే పాన్ ఇండియా లెవెల్‌లో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా దాదాపు 1800 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఓ పక్క మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే, మరోపక్క ఓటీటీ వేదికల్లోనూ అద్భుతమైన వ్యూస్ సాధించింది. అయితే తాజాగా ఈ చిత్రం టెలివిజన్‌లో ప్రసారం అయిన తర్వాత వచ్చిన టీఆర్పీ రేటింగ్ కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది.

'పుష్ప 2' మొదటిసారి టీవీలో ప్రసారమైనప్పుడు 12.61 టీఆర్పీ సాధించింది. ఈ రేటింగ్, బన్నీ గత సినిమాలతో పోల్చితే చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేసిన చిత్రం.. మరోవైపు టీవీ ప్రేక్షకుల వద్ద అంతగా ఆకట్టుకోలేకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో అల్లు అర్జున్ సినిమాలకు వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ చూసినవారికి ఈ ఫలితం ఊహించనిది.

అయితే దీనికి గల ప్రధాన కారణం ఓటీటీ వేదికల్లో వచ్చిన భారీ వ్యూస్ కావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. 'పుష్ప 2' ఓటీటీలో విడుదలైన వెంటనే కోట్లాదిమంది చూసేసిన నేపథ్యంలో టీవీ ప్రసారంపై ప్రభావం పడడం సహజం. పైగా, సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో టీవీ ఆడియెన్స్ మధ్యలో విరమించటం కూడా జరగొచ్చు.

కాగా, బన్నీ గత సినిమాల టీఆర్పీ రికార్డ్స్ చూస్తే.. ఆయనకు టెలివిజన్‌లో స్ట్రాంగ్ క్రేజ్ ఉన్నది స్పష్టమవుతుంది. 'అల వైకుంఠపురములో' వంటి కుటుంబ కథా చిత్రం అత్యధికంగా 29.4 టీఆర్పీ సాధించింది. అదే విధంగా 'డీజే', 'పుష్ప: ది రైజ్' వంటి చిత్రాలకు కూడా మంచి స్పందన లభించింది. అయితే 'నా పేరు సూర్య' వంటి డిజాస్టర్ సినిమా కూడా 12 టీఆర్పీ సాధించింది. ఇక ‘పుష్ప 2’ అదే స్థాయిలో ఉండటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అల్లు అర్జున్ నుంచి ఇటీవలికాలంలో వచ్చిన సినిమాలకు మొదటి ప్రసారంలో వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ వివరాలు:

1. పుష్ప 2 – 12.61 TRP

2. పుష్ప: ది రైజ్ – 22.54 TRP

3. అల వైకుంఠపురములో – 29.4 TRP

4. నా పేరు సూర్య – 12 TRP

5. డీజే (దువ్వాడ జగన్నాధం) – 21.7 TRP

ఈ లిస్టు చూస్తే 'పుష్ప 2' టీఆర్పీ పరంగా బన్నీ గత సినిమాలకు సరితూగలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ బాక్సాఫీస్ హవా మాత్రం పుష్కలంగా కొనసాగింది. దీనిని బట్టి చూస్తే, టీవీ రేటింగ్ కంటే థియేటర్ అండ్ ఓటీటీ వ్యూస్ పై ప్రభావం ఎక్కువగా ఉండే రోజులు వచ్చేశాయనడంలో సందేహం లేదు.