Begin typing your search above and press return to search.

పూరీతో రిస్క్ చేసేందుకు మెగాస్టార్ రెడీనా..?

ఈ లిస్ట్ లో ముఖ్యంగా చెప్పుకునే పూరీ జగన్నాథ్ వస్తాడు. పూరీ మంచి ఫాం లో ఉన్నప్పటి నుంచి చిరుతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   16 Aug 2023 11:30 PM GMT
పూరీతో రిస్క్ చేసేందుకు మెగాస్టార్ రెడీనా..?
X

భోళా శంకర్ ఇచ్చిన షాక్ తో డీలా పడ్డ మెగాస్టార్ చిరంజీవి ఇక మీదట దాదాపు రీమేక్ ల జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయినట్టే అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ గాడ్ ఫాదర్ రీసెంట్ గా భోళా శంకర్ సినిమాలు ఫ్లాప్ ల వల్ల ఒరిజినల్ కథల వాల్యూస్ తెలిసి వచ్చినట్టు అయ్యింది.

అయితే చిరు కోసం కథలు రెడీ చేసే రైటర్లు, డైరెక్టర్లు మన దగ్గర లేరా అంటే ఉన్నారు కానీ వాటిని ఓ పట్టాన ఓకే చేయరు మెగాస్టార్. ఒకరిద్దరు దర్శకులు అయితే చిరుతో సినిమా కోసం దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్నా వారి కథలకు ఏవో కారణాలు చెప్పి వాయిదా వేస్తున్నారు.

ఈ లిస్ట్ లో ముఖ్యంగా చెప్పుకునే పూరీ జగన్నాథ్ వస్తాడు. పూరీ మంచి ఫాం లో ఉన్నప్పటి నుంచి చిరుతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పూరీ మెగాస్టార్ చిరంజీవి సినిమా కుదరలేదు. చిరు కోసం ఆటో జానీ కథ రాసుకున్న పూరీ ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. ఏవేవో రీజన్స్ చెప్పి చిరంజీవి పూరీ సినిమా వద్దని చెబుతూ వచ్చాడు. అయితే భోళా శంకర్ ఇచ్చిన షాక్ వల్ల పూరీ సినిమాపై ఉన్న అనుమానాలు తొలగినట్టే అని తెలుస్తుంది.

చిరు ఇమేజ్ కి తగినట్టుగా పూరీ డైరెక్షన్.. ఆయన హీరో క్యారెక్టరైజేషన్ మెగా ఫ్యాన్స్ ని మెప్పించేలా చేస్తుందని చిరుకి ఇప్పటికి నమ్మకం కుదిరింది. అలా ఎలా అంటే రీమేక్ కథల్లో ఎంత ప్రయత్నించినా ఆడియన్స్ ఓన్ చేసుకోలేకపోతున్నారు అందుకే తన కోసం రాసిన కథ అయితే తనకు పర్ఫెక్ట్ అని క్లారిటీకి వచ్చారు చిరంజీవి. అందుకే భోళా ఫ్లాప్ తర్వాత పూరీ సినిమా గురించి పునరాలోచనలో ఉన్నారట. త్వరలోనే పూరీకి కాల్ వెళ్తుందని చెప్పుకుంటున్నారు.

పూరీతో చిరు రిస్కేమో బాసు అన్న వారు కూడా భోళా శంకర్ లాంటి రీమేక్ లతో పోల్చితే పూరీ తో రిస్క్ చేయడం బెటర్ అని చెబుతున్నారు. పూరీ ప్రస్తుతం రాం తో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చిరుతోనే పూరీ సినిమా ఉంటుందని చెప్పొచ్చు. ఈలోగా మెగాస్టార్ చిరంజీవి బింబిసార వశిష్టతో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. చిరుతో కళ్యాణ్ కృష్ణ కూడా సినిమా ప్లానింగ్ లో ఉందని తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.