Begin typing your search above and press return to search.

2024 లో పూరి త‌మ్ముడు దూకుడు

అయితే ఈ సినిమాల‌న్ని ఏడేళ్ల గ్యాప్ త‌ర్వాత చేయ‌డం విశేషం. సాయిరాం శంక‌ర్ చివ‌రిగా 2017 లో `నేనోర‌కం` అనే సినిమా చేసాడు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 10:30 AM GMT
2024 లో పూరి త‌మ్ముడు దూకుడు
X

సాయిరాం శంక‌ర్ 2024 లో థియేట‌ర్లో బాగానే సంద‌డి షురూ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇంతకాలం ఖాళీగా ఉన్నా ఒక్క‌సారిగా సాయిరాం మ‌ళ్లీ బిజీ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం సాయి రాం శంక‌ర్ హీరోగా మూడు సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. `ఒక ప‌థ‌కం ప్ర‌కారం`..`వెయ్ ద‌రువేయ్`..`బంప‌ర్ ఆఫ‌ర్ -2` చిత్రాల్లో న‌టి స్తున్నాడు. వీటిలో రెండు చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గా `బంప‌ర్ ఆఫ‌ర్` సీక్వెల్ ప్రారంభం కావాల్సి ఉంది.

అయితే ఈ సినిమాల‌న్ని ఏడేళ్ల గ్యాప్ త‌ర్వాత చేయ‌డం విశేషం. సాయిరాం శంక‌ర్ చివ‌రిగా 2017 లో `నేనోర‌కం` అనే సినిమా చేసాడు. ఆ త‌ర్వాత ఎలాంటి సినిమాలు చేయ‌లేదు. అప్ప‌టికే మార్కెట్ డ‌ల్ గా ఉంది. రిట‌ర్న్స్ కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేదు. దీంతో అవ‌కాశాలు రాలేదు. అయినా మ‌ళ్లీ క‌ష్టే ఫ‌లి అన్న చందంగా స్వ‌యంగా త‌న ప్ర‌య‌త్నాలు తానే చేసి ఈ కొత్త అవ‌కాశాలు అందుకున్నాడు. మ‌రి ఈ సినిమాలు సాయిరాం ని మ‌ళ్లీ పైకి లేపుతాయా? లేదా? అన్న‌ది చూడాలి.

ప్ర‌స్తుతం సాయిరాం స్థితిలో త‌ప్ప‌కుండా ఓ విజ‌యం ప‌డాలి. అప్పుడే ట్రాక్ లోకి వ‌చ్చిన‌ట్లు లేదంటే మ‌ళ్లీ ఛాన్సులు క‌ష్ట‌మే. మ‌రోవైపు సోద‌రుడు డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ వేగం కూడా త‌గ్గిన సంగ‌తి తెలి సిందే. `ఇస్మార్ట్ శంక‌ర్` త‌ర్వాత మ‌ళ్లీ వైఫ‌ల్యాల జోరు మొద‌లైంది. తాను చేస్తోన్న కొత్త సినిమాలేవి ఆశిం చిన ఫ‌లితాలు సాధించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో `ఇస్మార్ట్ శంక‌ర్ -2` ని ఆచితూచి చేస్తున్నాడు.

అత‌డికి విజ‌యం కీల‌కం కావ‌డంతో వేగం త‌గ్గించి ప‌నిచేస్తున్నాడు. పూరి ఫేట్ ని సైతం ఈసినిమా డిసైడ్ చేస్తుంద‌నే టాక్ ఉంది. ఈ సినిమా త‌ప్ప కొత్త అవ‌కాశం కూడా పూరి చేతిలో లేదు. ఇప్పుడు హీరోలంతా బిజీగా ఉన్న త‌రుణంలో పూరిహిట్ కొడితే త‌ప్ప హీరోలు డేట్లు ఇచ్చే ప‌రిస్థితిలో లేరు. ఆ ర‌కంగా అన్న‌ద మ్ములిద్ద‌రికీ 2024 కీల‌క‌మ‌నే తెలుస్తోంది. అప్ప‌ట్లో `బంప‌ర్ ఆఫ‌ర్` భారీ విజ‌యం సాధించింది. అదే స‌క్సెస్ ని కొన‌సాగించాల‌ని ఆ సినిమాకి సీక్వెల్ ని తెర‌పైకి తెచ్చారు.