మతాలు వ్యాపించడానికి కారణం అదే!
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమిళ హీరో విజయ్ సేతుపతితో తన తర్వాతి సినిమాను చేయనున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 6 May 2025 4:04 PM ISTటాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమిళ హీరో విజయ్ సేతుపతితో తన తర్వాతి సినిమాను చేయనున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ లోపు పాడ్‌కాస్ట్ ద్వారా పూరీ తన ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. పూరీ మ్యూజింగ్స్ పేరుతో వివిధ అంశాలపై పూరీ తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఉంటాడు. తాజాగా సిల్క్ రోడ్ అంశంపై పూరీ మాట్లాడాడు.
పూర్వం చైనా నుంచి యూరప్ వరకు ఓ కనెక్టింగ్ రూట్ ఉండేదని, దాని పేరు సిల్క్ రూట్ అని చెప్పాడు పూరీ. ఆ రోజుల్లో చైనా సిల్క్ కు యూరప్ లో చాలా డిమాండ్ ఉండేదని, ఈ రూట్ ను సిల్క్ బిజినెస్ కోసం మొదలుపెట్టారని చెప్పాడు పూరీ. 36 దేశాలను కలిపే ఈ సిల్క్ రూట్ పొడవు 6,400 కిలో మీటర్లు ఉంటుందని చెప్పాడు.
ఈ రూట్ లో వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామో లేదో ఎవరికీ తెలీదని, ఈ సిల్క్ రూట్ ఎంతో డేంజరస్ అని చెప్పాడు పూరీ. ఈ రూట్ 36 దేశాలను కలుపుతుందని, ఈ రూట్ ద్వారానే 1500 ఏళ్ల పాటూ వ్యాపారం జరిగిందని, ఒక చోట నుంచి మరో చోటుకు మతాలు వ్యాపించడానికి ఈ సిల్క్ రూటే కారణమని కూడా పూరీ తెలిపాడు.
ఈ రూట్ లో వెళ్లాలంటే ఎవరైనా సరే గోబీ, తక్లమకన్ అనే ఎడారులను దాటుకుంటూ, ఇసుక తుఫానుల మధ్య ప్రయాణం చేయాలని, అక్కడ చాలా హై టెంపరేచర్స్ ఉంటాయని అక్కడ ఒంటెలు, గుర్రాల్లేకుండా ఎవరూ ట్రావెల్ చేయలేరని, చైనా నుంచి టర్కీలో ఉన్న అనటోలియాకి చేరాలంటే ఓ ఏడాది పైనే పట్టేదని, ఈ సిల్క్ రూట్ ద్వారా కేవలం సిల్క్ మాత్రమే కాకుండా మసాలా, కుంకుమ, దాల్చిన చెక్క, మిరియాలు కూడా ఎక్స్‌పోర్ట్ అయ్యేవని పూరీ చెప్పుకొచ్చాడు.
ఈ రోడ్ వలన ఇస్లాం, క్రిస్టియానిటీ, బుద్ధిజం లాంటివి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయని, ఇవి మాత్రమే కాకుండా చైనా నుంచి జేడ్, ఏనుగు దంతాలు, రోమ్ నుంచి గోల్డ్, సిల్వర్, మంగోలియా గుర్రాలతో పాటూ పలు దేశాల నుంచి పేపర్, గన్ పౌడర్ కూడా సరఫరా జరిగేదని, వాటి కోసం మధ్యలో దొంగలు ఎటాక్ చేయడం మొదలుపెట్టారని, 1500 ఏళ్ల పాటూ ప్రపంచం మొత్తం బిజినెస్ కోసం ఆ రూట్ నే వాడిందని, తర్వాత సముద్ర మార్గం కనుక్కున్న తర్వాత ఆ రూటు వాడకాన్ని తగ్గించారని చెప్పిన పూరీ, వరల్డ్ గ్లోబలైజేషన్ కు ఫస్ట్ రీజన్ ఈ సిల్క్ రూటేనని, ఇప్పటికీ కొందరు ట్రావెలర్స్ నడుచుకుంటూ ఆ రూట్ లో ట్రావెల్ చేస్తుంటారని పూరీ చెప్పాడు.
