Begin typing your search above and press return to search.

కాస్టింగ్ ఎంపిక‌తోనే పూరి బ్లాక్‌బ‌స్ట‌ర్!

ప్ర‌తి ఒక్క‌రిలో మార్పు అనివార్యం. పాత చింత‌కాయ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లు లేదా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ హీరోల‌తో సినిమాలు అన్నివేళ‌లా వ‌ర్క‌వుట్ కావు.

By:  Tupaki Desk   |   25 April 2025 3:45 AM
కాస్టింగ్ ఎంపిక‌తోనే పూరి బ్లాక్‌బ‌స్ట‌ర్!
X

ప్ర‌తి ఒక్క‌రిలో మార్పు అనివార్యం. పాత చింత‌కాయ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లు లేదా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ హీరోల‌తో సినిమాలు అన్నివేళ‌లా వ‌ర్క‌వుట్ కావు. బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి అనుభ‌వాలు ఎన్నో పూరి జ‌గ‌న్నాథ్ లాంటి సీనియ‌ర్ ఎదుర్కొన్నారు. అందుకే అత‌డు ఎప్ప‌టికి మార‌తాడు? అంటూ అభిమానులు కూడా చాలా ఓపిగ్గా వేచి చూస్తున్నారు. లైగ‌ర్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత పూరి పూర్తిగా మారిన మ‌నిషిగా తిరిగి రావాల‌ని కూడా అంతా కోరుకున్నారు. అయితే పూరీలో ఈ మార్పు కొట్టొచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది.

అత‌డు త‌న త‌దుప‌రి చిత్రం కోసం చాలా కాలం వేచి చూసాడు! అంటే ఈసారి రెగ్యుల‌ర్ స్క్రిప్టుతో అత‌డు ముందుకు సాగ‌డం లేదు. పైగా అత‌డు త‌న స్క్రిప్టుతో విజ‌య్ సేతుప‌తి, ట‌బు లాంటి జాతీయ ఉత్త‌మ న‌టీన‌టుల‌ను లాక్ చేసాడంటే క‌చ్ఛితంగా ఇందులో ఏదో మ్యాట‌ర్ ఉంద‌ని గ్ర‌హించాలి. ఆస‌క్తిక‌రంగా సేతుప‌తి, ట‌బుల‌తో మ‌రో జాతీయ ఉత్త‌మ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ క‌లిసి న‌టిస్తార‌ని, అత‌డు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌ను పోషిస్తాడ‌ని తాజాగా గుస‌గుస వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఫ‌హ‌ద్ స్క్రిప్టు విని ఓకే చెప్పాడ‌ట‌.

ఇదంతా నిజ‌మే అయితే పూరి మారిన మ‌నిషి అని ప్రూవ్ అయిన‌ట్టే. అత‌డు రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ స్టార్ల‌తో కాకుండా ఇప్పుడు ప‌వ‌ర్ ప్యాక్డ్ న‌టీన‌టుల‌తో త‌న ప‌థ‌కాన్ని ర‌చించాడు. ఈసారి క‌థ వేరు.. స్క్రిప్టు వేరు.. స్క్రీన్ ప్లే వేరు.. ప్ర‌తిదీ పూర్తి కొత్త‌గా భిన్నంగా ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఎన్ని మారినా కానీ, పూరి మార్క్ టేకింగ్, స్పీడ్ స్క్రీన్ ప్లే, మంచి మ్యూజిక్ పాట‌లు, అవ‌స‌రం మేర‌ పంచ్ డైలాగులు ఇవేవీ మార‌కుండానే, అత‌డు ఒక గొప్ప క‌థ‌లో అత్య‌ద్భుత‌మైన పాత్ర‌ల‌తో ర‌క్తి క‌ట్టిస్తాడ‌నే అభిమానులు ఆశిస్తున్నారు. సేతుప‌తి-ట‌బు- ఫ‌హ‌ద్ లాంటి జాతీయ ఉత్త‌మ తార‌ల‌తో అత‌డు ప్లాన్ చేసేది ఆషామాషీగా ఉండ‌కూడ‌ద‌ని కూడా భావిస్తున్నారు. ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.