పూరి మ్యూజింగ్స్: ముసలాళ్లను కైలాసం పంపే ఆచారం బ్యాన్!
ఇప్పుడు మరో ఆసక్తికరమైన టాపిక్ తో పూరి మ్యూజింగ్స్ రక్తి కట్టించింది.
By: Sivaji Kontham | 25 May 2026 12:42 AM IST'పూరి మ్యూజింగ్స్' పాడ్ కాస్ట్ ద్వారా ఇప్పటివరకూ ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేసారు పూరి జగన్నాథ్. ప్రతిసారీ కొత్త కొత్త సబ్జెక్టులను టచ్ చేస్తూ ఇన్నోవేటివ్ విషయాలను, చారిత్రక అంశాలను, సైన్స్, మిస్టరీ వంటి టాపిక్స్ తో కుతూహాలం కలిగిస్తున్నారు పూరి. ఇప్పుడు మరో ఆసక్తికరమైన టాపిక్ తో పూరి మ్యూజింగ్స్ రక్తి కట్టించింది.
పూర్వం తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఒక ఆచారం ఉండేది. దాని పేరు 'తలైకూత్తల్'. ఇంట్లో పెద్దవాళ్ళు, వృద్ధాప్యం మీద పడ్డాక రకరకాల రోగాలతో బాధపడుతూ ఉంటారు.. నడవలేక, కదలలేక, నెలల తరబడి మంచాన పడి ఉంటారు. చావు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. చావు రాకపోయేసరికి ఏదో ఒక రోజు చనిపోవాలని నిర్ణయించుకుంటారు. అదే తలైకూత్తల్.
చనిపోయే వ్యక్తి రెండు రోజులు తన మనవళ్లతో, పిల్లలతో ఆడుకుంటాడు. తను చెప్పాలనుకుంది అందరికీ చెప్పుకుంటాడు. తన చివరి క్షణాలు ఆనందంగా కుటుంబీకులతో గడుపుతాడు. ఆ మరుసటి రోజు ఈ కార్యక్రమం మొదలవుతుంది. అతనికి ఆయిల్‌తో మసాజ్ చేస్తారు. ముఖ్యంగా తలకి నూనె రాసి మర్దనా చేస్తారు. ఆ తర్వాత చన్నీళ్లతో అతడికి తల స్నానం చేయిస్తారు. ఆ తర్వాత అతడికి కడుపు నిండా కొబ్బరి నీళ్లు తాగిస్తారు.
ఇలా చేయడం వల్ల అతనికి విపరీతమైన జ్వరం వచ్చి.. కిడ్నీ ఫెయిల్యూర్ అయి.. రెండు రోజుల్లో ఆయన చనిపోతాడు. దీన్ని సెన్సైడ్ అంటారు. ఒక విధంగా చెప్పాలంటే మెర్సీ కిల్లింగ్ లాంటిది. తర్వాతి రోజుల్లో ప్రభుత్వం ఈ ఆచారాన్ని పూర్తిగా నిషేధించింది... అని ఆసక్తికర టాపిక్ తో ఆశ్చర్యపరిచారు పూరి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... పూరి ప్రస్తుతం ట్యాలెంటెడ్ విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఇప్పటికే పోస్టర్లు ఆసక్తిని కలిగించాయి. ఈ సినిమా షూటింగ్ ముంబై, హైదరాబాద్ పరిసరాల్లోని వివిధ లొకేషన్లలో జరుగుతోంది. కోలీవుడ్ మక్కల్ సెల్వన్ సహజ నటనకు, పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్ తోడైతే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. 2026 చివరిలో విడుదలయ్యేందుకు ఛాన్సుంది.
