పూరి 'బెగ్గర్' కోసం మరో పవర్ఫుల్ స్టార్
విజయ్ సేతుపతి, విజయ్ కుమార్ కలిసి తెరపై వైల్డ్ యాక్షన్ చూపించనున్నట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 28 April 2025 2:15 PMపూరి జగన్నాథ్ మరోసారి తన మార్క్ మాస్ ఎంటర్టైన్‌మెంట్‌తో ఇండియన్ సినిమాను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. డబుల్ ఇస్మార్ట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న పూరి, ఇప్పుడు కొత్త జోష్‌తో పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాడు. విజయ్ సేతుపతి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకు టాలెంటెడ్ నటీనటులతో కూడిన కాస్టింగ్ ఏర్పాటవుతోంది. పూరి, చార్మీ కౌర్ కలిసి ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఇక సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాలోకి మరో మాస్ డైనమైట్ యాక్టర్ జాయిన్ అయ్యాడు. కర్ణాటక సెన్సేషన్ విజయ్ కుమార్ ఈ చిత్రానికి అఫీషియల్‌గా అంగీకరించాడు. వీర సింహా రెడ్డి సినిమాతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకున్న విజయ్ కుమార్, ఇది వరుసగా చేస్తున్న రెండో తెలుగు సినిమా కావడం విశేషం. ఆయన ప్రత్యేకమైన మాస్ అప్పీల్, హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారబోతోంది.
విజయ్ సేతుపతి, విజయ్ కుమార్ కలిసి తెరపై వైల్డ్ యాక్షన్ చూపించనున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరోసారి తన రేంజ్‌ను పెంచే పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా, ఓ డ్యాషింగ్ మాస్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక టబు కూడా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.
తెలుగు తెరపై చాలా రోజుల తర్వాత టబు మళ్లీ కీలక పాత్రలో కనిపించనుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. కథలో ఆమె పాత్ర కూడా పవర్ఫుల్ గా ఉండబోతుందట. ఈ సినిమా కథను పూరి జగన్నాథ్ స్వయంగా రచించారు. పూరి సినిమాల్లో మామూలు మాస్ డైలాగ్స్, యాక్షన్ థ్రిల్ల్స్ ఎంత ప్రత్యేకమో అందరికీ తెలుసు. ఈసారి కూడా అదే మాస్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీని, కొత్త రకం భావోద్వేగంతో మిక్స్ చేయబోతున్నట్లు సమాచారం.
తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది. అన్ని పనులు వేగంగా జరిపి, వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి యూనిట్ గట్టిగా ప్లాన్ చేస్తోంది. పూరి మార్క్ మళ్లీ కనిపించబోతున్న ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, డైరెక్టర్‌గా ఆయనకు తిరిగి మాస్ క్రేజ్ దక్కడం ఖాయం.