Begin typing your search above and press return to search.

పూరీ- సేతుపతి మూవీ.. మరో హీరోయిన్ ఫిక్స్..

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇప్పుడు తన అప్ కమింగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Jun 2025 5:48 AM
పూరీ- సేతుపతి మూవీ.. మరో హీరోయిన్ ఫిక్స్..
X

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇప్పుడు తన అప్ కమింగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరితో పాటు ఛార్మీ కౌర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వగా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. అందుకు గాను.. క్యాస్టింగ్ ను ఫిక్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఒక్కొక్క యాక్టర్ ను అనౌన్స్ చేస్తున్నారు. సీనియర్ నటి టబు నటిస్తున్నారని కొద్ది రోజుల క్రితం మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారని అనౌన్స్ చేశారు. ఇప్పుడు గోల్డెన్ బ్యూటీ సంయుక్త నటిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు. ఆమె నార్మల్ హీరోయిన్ గా కాకుండా, పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. యాక్టింగ్ కు మంచి స్కోప్ ఉన్న రోల్ ఆమెకు దక్కిందని సమాచారం.

నివేదా థామస్ ఒక కీలకపాత్రలో కనిపించనున్నట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. త్వరలో అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. భవతి భిక్షాం దేహి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కోసం లొకేషన్స్ ఫిక్స్ చేయడానికి హైదరాబాద్, చెన్నైను మేకర్స్ విజిట్ చేశారని తెలుస్తోంది.

జూన్ లాస్ట్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించే లక్ష్యంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్. తన సిగ్నేచర్ మాస్ స్టైల్ కు కమర్షియల్ యాంగిల్ ను యాడ్ చేసి.. పూరి స్పెషల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనున్నారని సమాచారం.

కాగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో దారుణంగా నిరాశపరిచారు పూరి జగన్నాథ్. ఫుల్ గా ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు. దీంతో పూరి పని అయిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ ఇంతలో విజయ్ సేతుపతితో మూవీని అనౌన్స్ చేశారు. కచ్చితంగా ఆ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వనున్నారని అంతా అంచనా వేస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.