పూరీ అన్ని అస్త్రాలు వాడేస్తున్నాడా..?
ఐతే ఈమధ్య పూరీ కూడా ఏళ్లకు ఏళ్లు సినిమా చేస్తున్నాడు. దాని వల్ల సినిమా బడ్జెట్ కూడా పెరుగుతుంది.
By: Tupaki Desk | 24 Jun 2025 8:15 AM ISTడేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తిరిగి ఫాంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. చివరగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని అనుకోగా ఆ సినిమా కూడా షాక్ ఇచ్చింది. ఐతే ఆ సినిమా తర్వాత పూరీకి ఏ హీరో ఛాన్స్ ఇస్తాడా అని డౌట్ పడుతుంటే షాకింగ్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అవకాశం ఇచ్చాడు. పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడింది. పూరీ డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా కాస్టింగ్ ని ఫైనల్ చేస్తున్నారు.
ఈ సినిమాలో టబు, దునియా విజయ్ ని తీసుకున్న పూరీ ఈమధ్యనే హీరోయిన్ గా సంయుక్త మీనన్ ని సెలెక్ట్ చేశారు. ఐతే ఈ సినిమా విషయంలో పూరీ చాలా ఫోకస్ తో పనిచేస్తున్నాడని తెలుస్తుంది. సినిమా కోసం పూరీ తన అన్ని అస్త్రాలు వాడుతున్నాడని తెలుస్తుంది. పూరీ సినిమా అంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలంతే అన్నట్టుగా ఉంటుంది. పూరీ ఇండస్ట్రీ హిట్లు కొట్టిన సినిమాలు కూడా తక్కువ టైం లోనే పూర్తి చేశాడు.
ఐతే ఈమధ్య పూరీ కూడా ఏళ్లకు ఏళ్లు సినిమా చేస్తున్నాడు. దాని వల్ల సినిమా బడ్జెట్ కూడా పెరుగుతుంది. అందుకే ఒకప్పటి పూరీలా సినిమా మొదలు పెట్టామా పూర్తి చేశామా అన్నట్టుగా ఉండాలని ఫిక్స్ అయ్యాడట. విజయ్ సేతుపతి కూడా పూరీ సినిమాకు ఇచ్చిన డేట్స్ లో సినిమా పూర్తి చేసేలా ప్లానింగ్ లో ఉన్నారట. సో పూరీ ఇప్పుడు కరెక్ట్ రూట్ లో ఉన్నాడని చెబుతున్నారు. అంతేకాదు హిట్ సినిమాకు కావాల్సిన అన్ని ముడి సరుకులను చేరవేస్తున్నట్టుగా తెలుస్తుంది.
విజయ్ సేతుపతిని ఒప్పించాడంటేనే పూరీ సగం సక్సెస్ అయినట్టు లెక్క. ఈమధ్య కొన్ని సినిమాలు నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చిన విజయ్ సేతుపతి లీడ్ రోల్ సినిమాలకు దూరం అవుతున్నాడని గుర్తించి ఇక మీదట అలాంటి రోల్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. ఇక పూరీ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది. సినిమా కథ ఏంటి అన్నది ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. విజయ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్న పూరీ జగన్నాథ్ కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి. పూరీ తన మార్క్ సక్సెస్ కొడితే ఆయన కన్నా ఆ డైరెక్టర్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు.
