పూరి జూన్ లో పట్టాలెక్కిస్తున్నాడా?
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ఓ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 April 2025 2:00 PM ISTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ఓ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. వరుస పరాజయాల్లో ఉన్న పూరికి మక్కల్ సెల్వన్ ఛాన్స్ ఇవ్వడంతో? ఇద్దరు ఎలాంటి చిత్రం చేస్తున్నారు? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది పూరి మార్క్ చిత్రమా? అందకు భిన్నంగా ఉంటుందా? అన్న దానిపై పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది.
లీకుల ప్రకారం డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నట్లు...స్టోరీ వినూత్నంగా ఉండటంతో సేతుపతి అంగీకరించాడన్నది ప్రాధమిక సమాచారం. పూరి సొంత నిర్మాణ సంస్థలోనే చార్మీ తో కలిసి నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది? రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడు? అన్నది ఇంత వరకూ ఎలాంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో చిత్రం జూన్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని పూరి కాంపౌండ్ వర్గాల నుంచి తెలిసింది.
జూన్ లోనే సినిమా ప్రారంభోత్సవం చేసి పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పూరి మరింత జాగ్రత్తగా తెరకెక్కించే అవకాశం ఉంది. స్టార్ డైరెక్టర్ గా వెలిగిన పూరి కొంత కాలంగా సరైన సక్సెస్ లు లేకపోవడంతో రేసులో వెనుకబడ్డాడు. ఆయనతో సినిమాలు తీసేందుకు స్టార్ హీరోలెవరు ముందుకు రాని సమయంలో? విజయ్ సేతుపతి ఛాన్స్ ఇవ్వడంతో పూరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అంతే ఉంది.
అలా బౌన్స్ బ్యాక్ అయితేనే పూరి బ్రాండ్ మళ్లీ మార్కెట్ లో మారు మ్రోగేది. ఒకప్పుడు పూరి బ్రాండ్ తోనే సినిమా మార్కెట్ అయిపోయేది. డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడి మరీ పూరి కంటెంట్ ని కొనేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో పూరి ముందున్న లక్ష్యం సక్సెస్ ఒక్కటే. ఇప్పటికే పూరి జనరేషన్ డైరెక్టర్లు ఔడెటెడ్ గా మారిపోతున్న సంగతి తెలిసిందే.
