Begin typing your search above and press return to search.

పూరి-విజయ్‌ మూవీ.. ఆ విషయంలో గందరగోళం

విజయ్ సేతుపతితో పూరి చేయబోతున్న సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది.

By:  Tupaki Desk   |   1 Jun 2025 12:00 AM IST
పూరి-విజయ్‌ మూవీ.. ఆ విషయంలో గందరగోళం
X

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ లైగర్‌ సినిమా తర్వాత కోలుకోవడంకు చాలా సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత చేసిన డబుల్‌ ఇస్మార్ట్‌ సైతం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దాంతో తన రూట్‌ను మార్చి విభిన్నమైన సినిమాను తీయడం కోసం పూరి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే తమిళ నటుడు విజయ్‌ సేతుపతితో విభిన్నమైన కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాను తీసేందుకు రెడీ అయ్యాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వచ్చింది. విజయ్ సేతుపతితో పూరి చేయబోతున్న సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది. మొన్నటి వరకు రాధిక ఆప్టే ఈ సినిమాలో నటిస్తుందనే వార్తలు వచ్చాయి.

ఈ సినిమాలో రాధిక ఆప్టే నటిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆమె కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని అంతా భావించారు. కానీ ఇటీవల ఒక చిట్‌ చాట్‌లో రాధిక ఆప్టే తాను పూరి-విజయ్ సినిమాలో పార్ట్‌ కావడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేసింది. మరి ఇన్నాళ్లు ఏం చేశారు అంటూ రాధిక ఆప్టేను పలువురు విమర్శిస్తున్నారు. కేవలం పారితోషికం కారణంగానే రాధిక ఆప్టే ఈ సినిమాను వదిలేసి ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయం ఏంటి అనేది ఆ పూరి జగన్నాథ్ లేదా రాధిక ఆప్టే నోరు తెరిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

పూరి-విజయ్ సినిమాలో రాధిక ఆప్టే నటించడం లేదని కన్ఫర్మ్‌ అయింది. అయితే టబు నటిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఆమెతో ఉన్న ఫోటోను పూరి, చార్మిలు షేర్ చేశారు. అందుకే ఆమె సినిమా నుంచి తప్పుకోవడం, లేకపోవడం అనేది ఏమీ లేదు. త్వరలోనే మరో నటిని ఎంపిక చేయడం కోసం పూరి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ మధ్య కథకు సరిపోయే విధంగా నివేదా థామస్‌ను ఎంపిక చేసే విషయాన్ని పరిశీలించారు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి వార్తలు రాలేదు. తాజాగా రాధిక ఆప్టే తప్పుకోవడంతో ఆ స్థానంలో లేదా మరేదైనా స్థానంలో నివేదా థామస్‌ను నటింపజేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇటీవల నివేదా థామస్‌ ఉత్తమ నటిగా 35 సినిమాకు గద్దర్‌ అవార్డ్‌ను అందుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రతిష్టాత్మక అవార్డ్‌ను ఎంతో మంది హీరోయిన్స్‌ను పక్కకు నెట్టి దక్కించుకుంది అంటే ఆ సినిమాలో నివేదా యొక్క నటన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నటిగా నివేదా చాలా సార్లు మంచి మార్కులు దక్కించుకుంది. కనుక పూరి కనుక యాక్టింగ్‌ ఓరియంటెడ్‌ పాత్రకు నటి కోసం వెతుకుతూ ఉంటే కచ్చితంగా నివేదా బెస్ట్‌ ఛాయిస్‌ అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి పూరి అభిప్రాయం ఏంటి, విజయ్ సేతుపతి యొక్క అభిప్రాయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అతి త్వరలోనే పూరి-విజయ్ సినిమా పట్టాలెక్కబోతుంది. అప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.