వాళ్లు డ్రామా క్రియేట్ చేయరు
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కరోనా టైమ్ నుంచి తన ఆలోచనలను పూరీ మ్యూజింగ్స్ పేరుతో పాడ్‌కాస్ట్ ద్వారా తెలుపుతూ బాగా ఫేమస్ అయ్యారు.
By: Tupaki Desk | 14 May 2025 2:57 PM ISTడైరెక్టర్ పూరీ జగన్నాథ్ కరోనా టైమ్ నుంచి తన ఆలోచనలను పూరీ మ్యూజింగ్స్ పేరుతో పాడ్‌కాస్ట్ ద్వారా తెలుపుతూ బాగా ఫేమస్ అయ్యారు. వివిధ విషయాలపై చర్చిస్తూ మాట్లాడే పూరీ తాజాగా స్ట్రాంగ్ పీపుల్ గురించి మాట్లాడుతూ, స్ట్రాంగ్ గా ఉండటమంటే ఏంటో మాట్లాడారు.
స్ట్రాంగ్ గా ఉన్నవాళ్లు జీవితంలో తమకు బాధ ఎదురైనప్పుడు కూడా అరవడం, ఏడవడం లాంటివి చేయరని, సైలెంట్ గా ఉంటారని చెప్పారు. స్ట్రాంగ్ పీపుల్ ఎప్పుడూ డ్రామా క్రియేట్ చేసి, అటెన్షన్ ను కోరుకోరని, తమకు అన్యాయం జరిగిందని అదే పనిగా చెప్పరని, తమ బాధను తమ లోపలే ఉంచుకుంటూ సైలెంట్ గా పక్కకెళ్తారని తెలిపారు.
ఒకసారి మోసపోతే మరోసారి ఎవరినైనా నమ్మడానికి, వారితో రిలేషన్ ను ఏర్పరచుకోవడానికి ముందు వందల సార్లు ఆలోచిస్తారని, ఒక్కసారి నమ్మకం కోల్పోతే జీవితంలో మళ్లీ వారిని నమ్మరని, స్ట్రాంగ్ గా ఉన్నవాళ్లు బయటకు నార్మల్ కనిపిస్తూ, నవ్వుతూ అందరితో దయగా ఉంటూ, ఫ్రెండ్లీ గా మాట్లాడినప్పటికీ లోపల మాత్రం వారు గతంలో ఉన్నప్పటి కంటే మరింత జాగ్రత్తగా ఉంటారని పూరీ చెప్తున్నారు.
స్ట్రాంగ్ పీపుల్ జీవితంలో ఏం కోల్పోయినా స్ట్రాంగ్ గానే ఉంటారు. ఎవరి మీదా ప్రతీకారం తీర్చుకోరు. ఒకరు తమని హర్ట్ చేశారని, దాన్ని మరొకరిపై చూపించరు. కాకపోతే ప్రతీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటూ తమని తాము మరింత స్ట్రాంగ్ గా చేసుకుంటారని పూరీ చెప్తున్నారు. లైఫ్ మిమ్మల్ని ఎంత టెస్ట్ చేసినా, ఎదుటివాళ్లు మిమ్మల్ని ఎంత బాధపెట్టినా దాన్ని ప్రశాంతంగా ఎదుర్కొని, వాటి నుంచి బయటపడి జీవిత పాఠాలను నేర్చుకోమని పూరీ తన ఫాలోవర్లకు సూచిస్తున్నారు.
