Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్ట‌ర్ చెక్కులిచ్చి మోస‌పోయాడా?

తాజాగా అదే సంఘ‌ట‌న‌ల‌ని గుర్తు చేస్తూ పూరి న‌మ్మి ఎలా మోస‌పోయాడో పూరి స‌న్నిహితుడు, గాయ‌కుడు, న‌టుడు స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

By:  Ravindar Gorantla   |   28 Feb 2026 3:00 PM IST
స్టార్ డైరెక్ట‌ర్ చెక్కులిచ్చి మోస‌పోయాడా?
X

టాలీవుడ్ వెండితెర‌పై హీరోయిజానికి, క్యారెక్ట‌రైజేష‌న్‌కి స‌రికొత్త నిర్వ‌చ‌నం చెప్పిన ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌. కెరీర్ ప్రారంభం నుంచి డైరెక్ట‌ర్‌గానే కాకుండా మంచి రైట‌ర్ గానూ పేరు తెచ్చుకున్నారు. సూప‌ర్ హిట్‌లు, బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని సొంతం చేసుకుని టాలీవుడ్‌లో రాకెట్ స్పీడుతో సినిమాలు చేస్తూ తిరుగులేని డైరెక్ట‌ర్ అనిపించుకున్నారు. `పోకిరి`తో ఇండ‌స్ట్రీ రికార్డ్స్‌ని తిర‌గ‌రాసిన పూరి డైరెక్ష‌న్‌లో ఒక్క సినిమా అయినా చేయాల‌ని ఎదురు చూడ‌ని స్టార్ హీరో లేరంటే అది అతిశ‌యోక్తి కాదు. హీరోయిజానికి వెండితెర‌పై స‌రికొత్త భాష్యం చెప్పిన ఆయ‌న‌తో క‌లిసి వ‌ర్క్ చేయాల‌ని చాలా మంది హీరోలు బాహాటంగానే స్టేట్‌మెంట్‌లిచ్చారు.

వ‌న్ లైన‌ర్స్ రాయ‌డంలో ఆయ‌న‌ని మించిన రైట‌ర్‌, డైరెక్ట‌ర్ ఇండియాలోనే లేడ‌ని స్వ‌యంగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రీసెంట్‌గా చెప్ప‌డం తెలిసిందే. ఇంత‌టి పాపులారిటీని సొంతం చేసుకుని టాప్ డైరెక్ట‌ర్‌గా ఓ వెలుగు వెలిగిన పూరి జ‌గ‌న్నాథ్ గ‌త కొంత కాలంగా గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. వ‌రుస సూప‌ర్ హిట్‌లు, బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించిన పూరి ఇప్పుడు స‌క్సెస్ కోసం, త‌న‌ని న‌మ్మి వ‌చ్చే స్టార్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక ద‌శ‌లో న‌మ్మిన వారి కార‌ణంగా కోట్లు న‌ష్ట‌పోయిన పూరి ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పూరి జ‌గ‌న్నాథ్ కొంత మందిని గుడ్డిగా న‌మ్మి మోస‌పోయార‌ని, ఎంతో మందికి స‌హాయం చేసే క్ర‌మంలో చెక్కులిస్తూ మోస‌పోయార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఇండ‌స్ట్రీలో ఎవ‌రికీ తెలియ‌కుండా దర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ చేసిన‌న్ని దానాలు, స‌హాయాలు ఎవ‌రూ చేసి ఉండ‌ర‌ని, ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల‌కు `స‌ర్ ఇలా ఇబ్బందులు ప‌డుతున్నాం` అని, రెంట్లు క‌ట్టుకోలేక‌పోతున్నామ‌ని త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికి స్పాట్‌లో రూ.25,000, రూ.3,0000 చెక్కులు పూరి రాసిచ్చేవాడ‌ట‌.

అలా కొంత మందికి చెక్కులు రాసిస్తూ.. పూరి జ‌గ‌న్నాథ్ మోస‌పోయాడ‌ని ఆయ‌న‌తో అత్యంత స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రించిన ఓ న‌టుడు, గాయ‌కుడు సోష‌ల్ మీడియా వేదిగాక షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. `బుడ్డా హోగా తేరా బాప్‌` సినిమాకు ముందు పూరి ఓ వ్య‌క్తి చేతితో మోస‌పోయాడ‌ని, డ‌బ్బులు భారీ స్థాయిలో పోగొట్టుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అందులో చాలా వ‌ర‌కు నిజ‌ముంద‌ని కూడా ఆ త‌రువాత లేలింది. తాజాగా అదే సంఘ‌ట‌న‌ల‌ని గుర్తు చేస్తూ పూరి న‌మ్మి ఎలా మోస‌పోయాడో పూరి స‌న్నిహితుడు, గాయ‌కుడు, న‌టుడు స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. త‌ను చెప్పిన దాన్ని బ‌ట్టి పూరిని చెక్కుల‌ని అడ్డుపెట్టుకునే ఇండ‌స్ట్రీకి చెందిన వ్యక్తి మోసం చేశాడ‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ ట్రాక్ త‌ప్పిన పూరి జ‌గ‌న్నాథ్ మ‌ళ్లీ త‌న పూర్వ వైభ‌వాన్ని ద‌క్కించుకునే ప‌నిలో ఉన్నారు. ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ క్రేజీ స్టార్ విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా రూపొందించిన మూవీ `స్లామ్ డాగ్‌`. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో విజ‌య్ సేతుప‌తి ఓ బిచ్చ‌గాడిగా క‌నిపించనున్నాడు. దీని త‌రువాత పూరి జ‌గ‌న్నాథ్‌ మ‌రో భారీ మూవీకి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. సూర్య హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో రూపొంద‌నున్న ఈ మూవీని త్వ‌ర‌లో స్టార్ట్ చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియ‌న్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లోనే రానుంది.