Begin typing your search above and press return to search.

ఒకప్పటి పూరి జగన్నాథ్ లో ఉన్నది ఇప్పుడు మిస్ అయింది ఇదే...

By:  Tupaki Desk   |   20 Sept 2026 6:00 PM IST
ఒకప్పటి పూరి జగన్నాథ్ లో ఉన్నది ఇప్పుడు మిస్ అయింది ఇదే...
X

ఒకప్పుడు సక్సెస్ ల పరంపరను కొనసాగించిన దర్శకులలో పూరి జగన్నాథ్ మొదటి స్థానంలో ఉంటాడు. బద్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన ఆ సినిమా సక్సెస్ తర్వాత వెను తిరిగి చూడలేదు. రవితేజ తో చేసిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'ఇడియట్', 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. నిజానికి ఒక దర్శకుడు హిట్టొస్తే పొంగిపోతాడు, ఫ్లాప్ వస్తే కృంగి పోతాడు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం హిట్టు ప్లాప్ లను ఎప్పుడు పట్టించుకోలేదు. తను ఒక హీరోకి కథ చెప్పినప్పుడు ఆ హీరో బిజీగా ఉంటే అదే కథను మరో హీరోతో చేసి సక్సెస్ ను సాధించాడు. అంతేతప్ప స్టార్ హీరోల డేట్స్ కోసం ఎప్పుడు వెయిట్ చేయలేదు. తనకు పని చేయడం అంటే ఇష్టం అది ఎవరితో అయినా పర్లేదు... మనం అనుకున్న ప్రాడెక్ట్ ను పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగితే హీరో ఎవరనేది ఎవరు పట్టించుకోరని అందులో ఎమోషన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే సినిమా ఈజీగా సక్సెస్ సాధిస్తుంది అనే ధోరణిలో ఆయన ఆలోచన ఉంటుంది.

ఇడియట్ తో రవితేజను ఫుల్ టైం హీరోగా మార్చేసిన దర్శకుడు కూడా పూరి జగన్నాథ్ కావడం విశేషం... ఒకప్పుడు ఎలాంటి పాయింట్ నైనా సరే సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్దచ్చు అని మాట్లాడిన పూరి జగన్నాథ్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ కథని రాసుకోవడంలో కొంతవరకు వెనక పడుతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఫ్లాప్ ల్లో ఉన్నాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో పూరి జగన్నాథ్ కి స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావడం లేదు. కానీ ఇప్పుడు విజయ్ సేతుపతి ని మెయిన్ లీడ్ లో పెట్టి చేసిన 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' అనే సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని టచ్ లోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ అయితే మామూలుగా ఉండదు. ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి సూపర్ సక్సెస్ ని సాధించాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.

అయితే ఒకప్పుడు పూరి రైటింగ్ లో స్పార్క్ కనిపించేది. ఆయన పెన్ను నుంచి వచ్చే ప్రతి డైలాగు ప్రేక్షకుల నోటిలో నానుతూ ఉండేది. ఎవరు ఏం మాట్లాడుకున్నా కూడా సిచువేషన్ కు తగ్గట్టుగా పూరి జగన్నాథ్ డైలాగులను వాడుతూ ఉండేవారు. అలాంటి ఒక మార్కును క్రియేట్ చేసుకున్న పూరీ జగన్నాథ్ ఇప్పుడు మాత్రం కొంతవరకు డీలాపడ్డాడు. మరోసారి ఆయన కంబ్యాక్ ఇచ్చి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది... పడిపోయిన ప్రతిసారి నిలబడటం పూరీకి అలవాటైపోయింది. ఒక్కసారి రెండుసార్ల కాదు ఇప్పటికి చాలా సార్లు తన పని అయిపోయిందని అనుకున్న ప్రతి సారి అంతకు మించిన ఉత్సాహంతో కంబ్యాక్ ఇచ్చాడు...ఇప్పుడు మరోసారి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది...