నాలుగేళ్ల తరువాత ఆకాష్‌తో పూరి!
టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొంత విరామం తరువాత క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రకటించిన విషయం తెలిపిందే.
By: Tupaki Desk | 14 May 2025 4:52 PM ISTటాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొంత విరామం తరువాత క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రకటించిన విషయం తెలిపిందే. విలక్షణమైన నటనతో, విభిన్నమైన కథలని ఎంచుకుంటూ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హీరోగా మంచి గునర్తింపును సొంతం చేసుకున్న తమిళ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. తొలిసారి విజయ్ సేతుపతి పూరితో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు.
పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కలిసి దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కీలక నటీనటులని ప్రకటించేశారు. టాబు కూడా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఓ కీలక క్యారెక్టర్ కోసం టబుని తీసుకున్నారట. అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` తరువాత టాబు అంగీకరించిన తెలుగు సినిమా ఇదే. ఇక ఇందులో కన్నడ నటుడు దునియా విజయ్ మరో కీలక క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని టీమ్ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం పూరి జగన్నాథ్ మరో క్యారెక్టర్‌ని దించేస్తున్నట్టుగా తెలుస్తోంది.
తనే పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి. `చోర్ బజార్` తరువాత మరో సినిమా అంగీకరించని ఆకాష్ పూరి గత కొంత కాలంగా సరైన స్క్రిప్ట్ కోసం, తనకు ఆర్టిస్ట్‌గా బ్రేక్ ఇచ్చే ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే తన తనయుడికి బ్రేక్ ఇవ్వాలనే ప్లాన్‌తో పూరి జగన్నాథ్ తన తనయుడిని ఈ సినిమాలోని ఓ కీలక క్యారెక్టర్ కోసం రంగంలోకి దించేస్తున్నాడట.
నాలుగేళ్ల క్రితం ఆకాష్ పూరి నటించిన `రొమాంటిక్` మూవీకి పూరి కథ, మాటలు అందించారు. అయినా ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆకాష్‌కు పెద్దగా ఉపయోగపడలేకపోయింది. అయితే మళ్లీ నాలుగేళ్ల విరామం తరువాత మరోపసారి తన తనయుడిని విజయ్ సేతుపతితో చేయబోతున్న సినిమా కోసం రంగంలోకి దించేస్తున్నారట.
