Begin typing your search above and press return to search.

@25.. కొడితే..మళ్ళీ దిమ్మతిరగాలి పూరి!

టాలీవుడ్‌ లో.ఎంతమంది కొత్త దర్శకులు, కంటెంట్ ఉన్న దర్శకులు పరిచయమైనా కూడా ఆల్ టైమ్ ఒక ట్రెండ్ సెట్ చేసిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు.

By:  Tupaki Desk   |   20 April 2025 4:21 PM IST
25 Years of Puri Jagannadh The Man Who Redefined Mass Cinema
X

టాలీవుడ్‌ లో.ఎంతమంది కొత్త దర్శకులు, కంటెంట్ ఉన్న దర్శకులు పరిచయమైనా కూడా ఆల్ టైమ్ ఒక ట్రెండ్ సెట్ చేసిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ఆయన కెరీర్‌ను ఓసారి వెనక్కి తిరిగి చూస్తే, ఎలాంటి హిట్స్ ఇచ్చారో తెలుస్తుంది. 2000లో బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పూరి, ఇప్పటివరకు 25 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఈ సందర్బంగా ఫిలిం కమ్యూనిటీ నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


పూరి జగన్నాథ్‌ అంటేనే డిఫరెంట్ టేకింగ్, మాస్ డైలాగ్స్, హీరోకు పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను డిజైన్ చేయడంలో స్పెషలిటీ. ఇడియట్, శివమణి, పోకిరి, బిజినెస్ మాన్, టెంపర్ వంటి సినిమాలు ఆయన స్టైల్‌కు నిదర్శనాలు. హీరో పవన్ కళ్యాణ్‌తో బద్రీ, మహేష్ బాబుతో పోకిరి, ఎన్టీఆర్‌తో టెంపర్‌ వంటి సినిమాలు పూరిని మరో లెవెల్ కు తెచ్చాయి.


అయితే ప్రతి దర్శకుడి జీవితంలో హైస్, లోస్ ఉంటాయి. పూరికి కూడా అలాంటి ఫేజ్ వచ్చింది. 'లోఫర్', 'మెహబూబా', 'లైగర్' వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాలేదు. ముఖ్యంగా లైగర్ సినిమా భారీ బడ్జెట్‌తో వచ్చినా నిరాశ పరిచింది. కానీ పూరి ఈ డిజాస్టర్స్‌తోనూ వెనక్కి తగ్గలేదు. ఇప్పటివరకు వచ్చిన ప్రతి పరాజయం తర్వాత పూరి రీ ఎంట్రీ ఎలా ఇచ్చాడో తెలిసిందే, ఈసారి కూడా అదే జరుగుతుందని నమ్ముతున్నారు.

'ఇస్మార్ట్ శంకర్' ముందు కూడా పూరి పరిస్థితి ఇలాగే ఉంది. కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో పూరి మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఇక లైగర్ డబుల్ ఇస్మార్ట్ అనంతరం కూడా ఫామ్ తోలి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్, తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతితో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాడు. ఇందులో టబు కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

పూరి స్క్రిప్ట్‌కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన పాత్రల డిజైన్‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌కి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. 25 ఏళ్ళ సినీ ప్రయాణంలో పూరి ఎన్నో విజయాలు, పరాజయాలను చూసారు. కానీ ప్రతిసారీ తిరిగి బౌన్స్ బ్యాక్ కావడం ముందుకు వెళ్లడం ఆయన ప్రత్యేకత. అదే ఆయనను మిగతా దర్శకుల కంటే భిన్నంగా హైలెట్ చేసింది. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో పూరి దిమ్మతిరిగేలా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.