Begin typing your search above and press return to search.

పూరీ కనెక్ట్స్ షాకింగ్ పోస్ట్.. అసలేం జరిగింది?

పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ కలిసి నడుపుతున్న పూరీ కనెక్ట్స్ బ్యానర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌ లో చర్చనీయాంశంగా మారింది.

By:  M Prashanth   |   4 Jun 2026 5:31 PM IST
పూరీ కనెక్ట్స్ షాకింగ్ పోస్ట్.. అసలేం జరిగింది?
X

పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ కలిసి నడుపుతున్న పూరీ కనెక్ట్స్ బ్యానర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌ లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా తమ నిర్మాణ సంస్థకు సంబంధించిన సినిమా అప్డేట్లు, పోస్టర్లు, టీజర్లు లేదా షూటింగ్ విశేషాలు మాత్రమే పంచుకునే ఆ బ్యానర్ నుంచి సడెన్ వచ్చిన పోస్ట్.. అభిమానులను, సినీ ప్రియులను ఆలోచనలో పడేసింది.

పూరీ కనెక్ట్స్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ లో 'ప్రతి ఒక్కడు దొంగ బట్టేరా.. మంచోడికి చోటు లేదురా' అనే లైన్ ను పోస్ట్ చేశారు. దానికి సీరియస్ నెస్ ను వ్యక్తం చేసే ఎమోజీలు, నిరాశను సూచించే సింబల్స్ కూడా యాడ్ చేయడం మరింత ఆసక్తి రేకెత్తించింది. ఆ లైన్స్ పూరీ జగన్నాథ్ సినిమాల్లో తరచుగా కనిపించే ఘాటైన డైలాగులు గుర్తు చేస్తున్నాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

అయితే అసలు ఆ పోస్ట్ వెనుక ఉద్దేశం ఏమిటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొందరు నెటిజన్లు ఇది ఏదో అసంతృప్తిని ఇన్ డైరెక్ట్ గా వ్యక్తం చేశారని అనుమానపడుతున్నారు. ఇండస్ట్రీలో జరిగిన ఏదైనా పరిణామం, బిజినెస్ కు సంబంధించిన సమస్య లేదా ఎవరి వల్లైనా ఎదురైన ఇబ్బందికి రెస్పాన్స్ గా పోస్ట్ పెట్టి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ లేదా ఛార్మీ కౌర్ ఆ ట్వీట్‌ పై క్లారిటీ ఇవ్వలేదు.

అదే సమయంలో ఆ పోస్ట్ ను పూర్తిగా వేరే యాంగిల్ లో మరి కొందరు నెటిజన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ సినిమాల ప్రమోషన్ విధానం ఎప్పుడూ భిన్నంగా ఉంటుందనే విషయం తెలిసిందే. కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తి రేకెత్తించే పోస్టులు, డౌట్స్ కలిగించే మెసేజెస్ రిలీజ్ చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. ఈ నేపథ్యంలో ఇది కూడా ఒక ప్రమోషనల్ స్ట్రాటజీ అయి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ లో కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో స్లమ్‌ డాగ్ - 33 టెంపుల్ రోడ్ మూవీ రూపొందుతోంది. ఆ సినిమా కథ లేదా కీలక డైలాగ్‌ కు సంబంధించిన ప్రమోషనల్ ప్లాన్ లో భాగంగా పోస్ట్ చేసి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. సినిమా పట్ల ఆడియన్స్ లో హైప్ పెంచేందుకు ఇలాంటి క్రిప్టిక్ పోస్టులు యూజ్ అవుతాయని చెబుతున్నారు.

అయితే అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో పోస్ట్ చుట్టూ అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు పూరీకి ఏదైనా అన్యాయం జరిగిందా? అని ప్రశ్నిస్తుంటే, మరికొందరు ఇది కచ్చితంగా కొత్త సినిమా ప్రచారమే అంటూ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఒక్క ట్వీట్‌ తోనే మరోసారి వార్తల్లో నిలవడంలో పూరీ కనెక్ట్స్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఆ పోస్ట్ వెనుక నిజంగా ఏదైనా ఆవేదన దాగి ఉందా? లేక స్లమ్‌ డాగ్ ప్రమోషన్‌ లో భాగంగా రూపొందించిన ప్లానా? అన్నది తెలియాలంటే పూరీ లేదా ఛార్మీ క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.