Begin typing your search above and press return to search.

ఏంటి జగదీష్ డూప్​తో పుష్ప-2 చేస్తారా? నమ్మేలా ఉందా?

అయితే జగదీశ్​ స్థానంలో డూప్​ను పెట్టి షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ భావించారట. అందుకు ప్లాన్​ చేసి డూప్​ను రప్పించి కొన్ని సీన్లు కూడా షూట్ చేశారట.

By:  Tupaki Desk   |   17 Dec 2023 12:30 AM GMT
ఏంటి జగదీష్ డూప్​తో పుష్ప-2 చేస్తారా? నమ్మేలా ఉందా?
X

ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో కేశవ పాత్రతో ఆకట్టుకున్న యాక్టర్ జగదీశ్​ ఇటీవలే ఓ కేసులో అరెస్ట్ కావడం టాలీవుడ్​లో సంచలనం రేపింది. దీంతో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న పుష్ప సీక్వెల్​ షూటింగ్​కు కేశవ అరెస్ట్ బ్రేక్ వేసిందని వార్తలు తెగచక్కర్లు కొడుతున్నాయి. సినిమా షూటింగ్‌పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

ఓ జూనియర్ మహిళా ఆర్టిస్ట్ మరణానికి కారణమయ్యాడంటూ పంజాగుట్ట పోలీసులు కొన్నిరోజుల క్రితం జగదీశ్​ను అరెస్ట్ చేసి 14రోజులు రిమాండ్​కు తరలించారు. అయితే పుష్ప-2లో జగదీశ్ పాత్ర కీలకంగా ఉండబోతుందని మనకు తెలిసిందే. కానీ పుష్ప-2కి సంబంధించి జగదీశ్ పార్ట్ షూటింగ్ పూర్తి కాలేదట. అయితే జగదీశ్​ స్థానంలో డూప్​ను పెట్టి షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ భావించారట. అందుకు ప్లాన్​ చేసి డూప్​ను రప్పించి కొన్ని సీన్లు కూడా షూట్ చేశారట.

కానీ అది వర్క్​ అవ్వలేదట. పైగా క్వాలిటీ విషయంలో దర్శకుడు సుకుమార్​ కూడా అసలు కాంప్రమైజ్ కారు. ఈ సినిమా నిర్మాతలైన మ్రైతీ మూవీ మేకర్స్ కూడా అంతే. ఇప్పుడు జగదీశ్​ను బెయిల్​ మీద బయటకు తీసుకురావడానికి మేకర్స్ గట్టిగా ప్లాన్​ చేస్తున్నారట. అందుకోసం దాదాపు రూ.15 లక్షలు వారు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. తమ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే పుష్ప టీమ్ జగదీశ్​కు బెయిల్ వచ్చేలా చేస్తుందట.

పుష్ప 2 బృందం షూట్‌ను సజావుగా ముగించేలా అతడిని బయటకు తీసుకురావడంపై పూర్తి దృష్టి పెట్టిందట. ఏది ఏమైనా తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. పుష్ప-1లో హీరోతో సమానంగా కేశవ పాత్రకు స్క్రీన్​ స్పేస్ ఉండగా.. రెండో భాగంలో కూడా అలానే ఉంటుంది. మరోవైపు, షూటింగ్​ సెట్​లోకి మరికొద్ది రోజుల్లో రష్మిక అడుగుపెట్టనున్నారట. ప్రస్తుతం యానిమల్ సినిమా హిట్​తో ఫుల్ జోష్​లో రష్మిక ఉన్నారట.

పుష్ప-2 సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, ప్రకాశ్​ రాజ్, జగపతిబాబు సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సీక్వెల్​కు కూడా దేవిశ్రీ ప్రసాద్​నే సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 వచ్చే ఏడాది సెకండాఫ్​లో రిలీజ్ కానుంది. 2024 ఆగస్టు 15న పుష్ప 2 ది రూల్​ను రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ మీద పాన్ ఇండియా రేంజ్​లో భారీ బజ్ నెలకొంది. ముఖ్యంగా హిందీ బెల్ట్​లో ఒక రేంజ్​లో ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నాయి.