Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ఆఫ‌ర్ కి రెండుసార్లు నో చెప్పిన న‌టుడు!

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌స్తే ఎవ‌రు వ‌దులుకుంటారు. హీరోయిన్ ఆఫ‌ర్ అయితే ఎగిరి గంతేస్తారు.

By:  Tupaki Desk   |   20 March 2024 6:33 AM GMT
మెగాస్టార్ ఆఫ‌ర్ కి రెండుసార్లు నో చెప్పిన న‌టుడు!
X

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌స్తే ఎవ‌రు వ‌దులుకుంటారు. హీరోయిన్ ఆఫ‌ర్ అయితే ఎగిరి గంతేస్తారు. న‌టుడిగా కీల‌క పాత్ర‌లో ఆఫ‌ర్ వ‌స్తే దాన్ని మిస్ చేసుకునే ఛాన్స్ ఉండ‌దు. ఆయ‌న సినిమాలో చిన్న రోల్ పోషించినా ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కుతుంద‌ని య‌స్ చెబుతారు. మరికొంత మంది ఒక్క సీన్ లో క‌నిపించినా చాలు చిరు బ్రాండ్ తో మార్కెట్ లో దూసుకుపోవ‌చ్చ‌ని భావించే మారు ఇంకొంద‌రు. మెగాస్టార్ సినిమా అంటే మార్కెట్ లో అంత బ్రాండ్.

అయితే అలాంటి స్టార్ ఇచ్చిన అవ‌కాశాన్ని ఓ న‌టుడు ఒక‌సారి కాదు..ఏకంగా రెండుసార్లు వ‌ద‌లు కున్న‌ట్లు తెలిపాడు. ఇంత‌కీ ఎవరా న‌టుడు? వ‌చ్చిన అవాశాలు ఎందుకు వ‌దులుకున్నాడు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ఆన‌టుడు ఎవ‌రో కాదు మ‌ల‌యాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్. ఇత‌డు ఇప్పుడు న‌ట‌న‌తో పాటు ద‌ర్శ‌క‌త్వంలోనూ రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండింటా స‌క్సెస్ అయిన ప్ర‌తిభావంతుడు.

అయితే చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి` సినిమాలో ఓకీల‌క పాత్ర కోసం పృధ్వీరాజ్ ని తీసుకోవాల‌ని చిరంజీవి భావించారుట‌. నేరుగా చిరంజీవి ఫోన్ చేసి న‌టించాల‌ని కోరారుట‌. కానీ అప్పుడు ఆడు జీవితం సినిమాకే కాల్షీట్లు మొత్తం కేటాయించ‌ని..లార్జెన్ దేన్ లైఫ్ మూవీ కావ‌డంతో త‌ప్ప‌లేదు అన‌డంతో చిరంజీవి దాన్ని స్వాగ‌తించి ..ప‌రిస్థితి అర్ధం చేసుకుని ఒకే చెప్పారుట‌.

ఆ త‌ర్వాత` లూసీఫ‌ర్` చిత్రాన్ని రీమేక్ చేయాల‌ని..దానికి పృథ్వీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని మ‌రోసారి చిరు నుంచి కాల్ వెళ్లిందిట‌. అప్పుడు కూడా అదే రీజ‌న్ చెప్పారుట‌. దీంతో చిరంజీవి షాక్ అయ్యారుట‌. ఏంటి అత‌ను అని మ‌న‌సులో అనుకునే ఉంటార‌ని తాజాగా పృథ్వీరాజ్ రివీల్ చేసాడు. ఆడు జీవితం సినిమా షూటింగ్ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో డిలే అవ్వ‌డంతో ఆ సినిమాకే స‌మ‌య‌మంతా కేటాయించాల్సి వ‌చ్చిం ద‌ని..అందుకే ఏ సినిమా చేయ‌లేక పోయిన‌ట్లు తెలిపాడు. `లూసీఫ‌ర్` చిత్రాన్ని పృధ్వీరాజ్ మ‌ల‌యాళం తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. అందుకే రీమేక్ ఛాన్స్ కూడా చిరంజీవి ఆయ‌న‌కి ఇవ్వాల‌ని చూసారు. కుద‌ర‌క పోవ‌డంతో మోహ‌న్ రాజాని బ‌రిలోకి దించి చేసారు.