Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ సినిమాలో 'సలార్‌' శివ మన్నార్‌...!

శివ మన్నార్ పాత్రకు మరో యూనివర్స్‌ లో కూడా షాకింగ్‌ రోల్‌ ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు.

By:  Tupaki Desk   |   8 May 2024 11:30 AM GMT
ఎన్టీఆర్‌ సినిమాలో సలార్‌ శివ మన్నార్‌...!
X

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్‌ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సలార్‌ సినిమాలో ప్రభాస్ తో పాటు మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలకమైన వరదరాజ మన్నార్ మరియు శివ మన్నార్ పాత్రల్లో కనిపించిన విషయం తెల్సిందే.

సలార్‌ 1 లోని పాత్రతో పోల్చితే సలార్‌ 2 లో తన పాత్ర అత్యంత పవర్ ఫుల్‌ గా ఉంటుంది అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నాడు. సలార్‌ 2 కోసం వెయిటింగ్‌ పెంచే విధంగా పృథ్వీరాజ్ వ్యాఖ్యలు ఉన్నాయి. తాజాగా మరోసారి పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

సోషల్‌ మీడియా ద్వారా ఒక ఫ్యాన్‌.. శివ మన్నార్‌ పాత్ర చాలా బాగుంది, ఆ పాత్రను మరింతగా చూడాలని కోరుకుంటున్నాం అంటూ పోస్ట్‌ చేసి పృథ్వీరాజ్ సుకుమారన్‌ ను ట్యాగ్‌ చేయడం జరిగింది. ఆ ట్వీట్‌ కు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ స్పందించాడు.

శివ మన్నార్ పాత్రకు మరో యూనివర్స్‌ లో కూడా షాకింగ్‌ రోల్‌ ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. పృథ్వీరాజ్ మాటలను బట్టి చూస్తే సలార్‌ 2 లో కాకుండా మరో సినిమాలో కూడా శివ మన్నార్‌ పాత్ర ఉండబోతుంది, ప్రశాంత్‌ నీల్‌ తన తదుపరి సినిమాలో కూడా ఆ పాత్రను పెట్టబోతున్నాడు అనే చర్చ మొదలు అయ్యింది.

సలార్ 2 తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపొందబోతున్న విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితమే వీరి కాంబో మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. అయినా కూడా ఇప్పటి వరకు సినిమా పట్టాలెక్కలేదు. ఆ సినిమాలో శివ మన్నార్‌ పాత్ర ను కలిపే అవకాశాలు ఉన్నాయి.

సాధారణంగా లోకేష్ కనగరాజ్‌ తన ఒక సినిమాకు మరో సినిమాకు లింక్ చేస్తూ పాత్రలను కంటిన్యూ చేస్తాడు. అలాగే సలార్‌ లోని శివ మన్నార్‌ పాత్రను ఎన్టీఆర్‌ సినిమాలో చూపించే విధంగా కథను ప్రశాంత్‌ నీల్‌ రెడీ చేస్తున్నాడా అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ మాటలను బట్టి చూస్తే ఔను అనే సమాధానం వినిపిస్తోంది.