Begin typing your search above and press return to search.

అయ్యో... ప్రశాంత్ వర్మకి పెళ్లి అయ్యిందా?

'అ' సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ వర్మ టాలీవుడ్‌ కి పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు

By:  Tupaki Desk   |   29 Jan 2024 10:30 AM GMT
అయ్యో... ప్రశాంత్ వర్మకి పెళ్లి అయ్యిందా?
X

'అ' సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ వర్మ టాలీవుడ్‌ కి పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు. విలక్షణ దర్శకుల జాబితాలో చోటు సంపాదించిన ప్రశాంత్ వర్మ తనకు వచ్చిన పేరుకు తగ్గట్లే తన ప్రతి సినిమా కూడా చాలా ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటూ ఉన్నాడు.

తాజాగా తేజ సజ్జా తో 'హనుమాన్‌' సినిమాను రూపొందించి మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. గుంటూరు కారం సినిమా కు పోటీ గా తీసుకుని వస్తున్నాడు.. ఈయన కాన్ఫిడెన్స్ ఏంట్రా బాబు అని అంతా అనుకున్నారు. ఆ సమయంలో ప్రశాంత్ వర్మ పై కోపం తెచ్చుకున్న వారు కూడా ఇప్పుడు వావ్‌ అంటూ హనుమాన్‌ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రశాంత్‌ వర్మ ఫాలోయింగ్‌ అమాంతం పెరిగింది. చూడ్డానికి హీరోగా కూడా ఉండటంతో అమ్మాయిల్లో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ క్రియేట్‌ అయ్యింది. చాలా మంది అమ్మాయిలు ప్రశాంత్‌ వర్మ తో ఆన్‌ లైన్‌ ద్వారానే ప్రేమలో పడ్డట్లుగా కామెంట్స్ పెట్టేస్తున్నారు.

ఇన్నాళ్లు చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ప్రశాంత్‌ వర్మ కు పెళ్లి అయ్యింది. తాజాగా సక్సెస్ మీట్ లో తన భార్యకు కృతజ్ఞతలు చెప్పాడు. అంతే కాకుండా ఆ కార్యక్రమం కు ఆమె వచ్చింది. దాంతో చాలా మంది అమ్మాయిలు అయ్యో ప్రశాంత్ వర్మ కి పెళ్లి అయ్యిందా అంటూ నోరు అంత పెద్దగా తెరిచి అవాక్కవుతున్నారు.

ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ భార్య సుకన్య కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తేజ మరియు ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతున్న సమయంలో సుకన్య సిగ్గు పడుతూ, నవ్వుతూ ఉన్న వీడియోలు మరియు ఫోటోలు అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి. ప్రశాంత్ వర్మకు ఇంత అందమైన వైఫ్‌ ఉందా అని కుర్రకారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.