ఆ బాధలో ఒకేసారి 9 సినిమాలను లైన్ లో పెట్టా
అయితే అలా విడిపోయిన తర్వాత ఆ పరిస్థితి నుంచి బయటకు రావడం ఎంత కష్టమనేది ఆ సిట్యుయేషన్ లో ఉన్న వారికే తెలుస్తుంది.
By: Tupaki Desk | 9 Jun 2025 10:00 PM ISTఈ మధ్య ఎంతో ఆర్భాటంగా పెళ్లి చేసుకోవడం, కలిసి మూడు నాలుగు వెకేషన్లకు వెళ్లడం, ఆ తర్వాత కొన్నాళ్లకు ఏవొక మనస్పర్థలతో విడిపోవడం ఎక్కువగా జరుగుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో అయితే ఈ ధోరణి మరీ ఎక్కువైపోయింది. అప్పటివరకు ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేం అన్నట్టు కనిపించిన వారే ఆ తర్వాత విడిపోయి ఒకరినొకరు నిందించుకుంటూ వార్తల్లోకెక్కుతున్నారు.
అయితే అలా విడిపోయిన తర్వాత ఆ పరిస్థితి నుంచి బయటకు రావడం ఎంత కష్టమనేది ఆ సిట్యుయేషన్ లో ఉన్న వారికే తెలుస్తుంది. ఆ బాధను మర్చిపోయి తిరిగి మామూలు మనిషి అవడం అంత ఈజీ కాదంటున్నాడు హీరో ప్రోసెంజిత్ చటర్జీ. తన కో యాక్టర్ దెబశ్రీ రాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రొసెంజిత్, పెళ్లి తర్వాత కొంత కాలానికే ఆమెతో విడిపోయాడు.
ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తామిద్దరూ విడిపోయినప్పుడు తమకు పెద్ద వయసేం లేదని, అందుకే ఒకరినొకరు నిందించుకున్నామని చెప్పాడు. విడిపోయిన తర్వాత ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయానని, వర్క్ పై అసలు ఫోకస్ పెట్టలేకపోయానని, కొంత కాలం పాటూ అదే డిప్రెషన్ లో ఉన్నట్టు ప్రొసెంజిత్ వెల్లడించాడు.
అదే టైమ్ లో బెంగాల్ లో టాప్ 10 యాక్టర్ల గురించి ఓ ఆర్టికల్ వచ్చిందని, ఆ టాప్ 10 లిస్ట్ లో ఎక్కడా తన పేరు లేకపోవడం తనను మరింత డిప్రెషన్ లోకి తీసుకెళ్లిందని, తర్వాత తనకు తాను సర్ది చెప్పుకుని, ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఒరిగేదేం లేదని, ఆఫీస్ కు వెళ్లి ఒకేసారి తొమ్మిది సినిమాలకు సంతకం చేసి వరుస సినిమాలను లైన్ లో పెట్టినట్టు చెప్పాడు.
బాధగా అనిపించినప్పుడు తోటకు వెళ్లి కాసేపు ప్రశాంతంగా రిలాక్స్ అవుతానని చెప్పిన ప్రొసెంజిత్ దెబశ్రీ తో విడిపోయాక మరోసారి ప్రేమలో పడి అపర్ణ గుహ తకుర్తను పెళ్లి చేసుకున్నాడు. ఓ పాప పుట్టాక ప్రేరణతో కూడా మనస్పర్థలు రావడంతో వారు కూడా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి అర్పితా పాల్ ను మూడో పెళ్లి చేసుకున్నాడు ప్రొసెంజిత్. ప్రస్తుతం ప్రొసెంజిత్ మాలిక్ అనే సినిమా చేస్తున్నాడు. పులకిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జులై 11న రిలీజ్ కానుంది.