Begin typing your search above and press return to search.

దేశంలో 500 కోట్లు సంపాదించిన ఏకైక క‌మెడియ‌న్

ఆ క‌మెడియ‌న్ ఆస్తుల విలువ 500కోట్లు. భారతదేశంలోని అత్యంత సంపన్న హాస్యనటుడు.

By:  Tupaki Desk   |   9 Oct 2023 3:00 AM GMT
దేశంలో 500 కోట్లు సంపాదించిన ఏకైక క‌మెడియ‌న్
X

ఆ క‌మెడియ‌న్ ఆస్తుల విలువ 500కోట్లు. భారతదేశంలోని అత్యంత సంపన్న హాస్యనటుడు. నేటిత‌రం ఆర్జ‌కులు కపిల్ శర్మ- భారతీ సింగ్ ల‌ను మించిన‌ ఆస్తిప‌రుడిగా పేరుంది. ఒక్కో సినిమాకు, అలాగే బ్రాండ్ ప్ర‌మోష‌న్ల‌కు కోట్ల‌లో పారితోషికాలు అందుకుంటున్నాడు. 35ఏళ్ల కెరీర్ లో సుమారు 1000 సినిమాల్లో న‌టించి నేటికీ రారాజుగా కొన‌సాగుతున్నాడు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

ఒక స్టార్ హీరో రేంజులో క‌మెడియ‌న్లు సంపాదించ‌గ‌ల‌రా? అనే సందేహాలుంటాయి. కానీ భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో క‌మెడియ‌న్లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు గొప్ప‌గా ఆర్జించేవారు లేక‌పోలేదు. ఇటీవ‌లి మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. కపిల్ శర్మ భారతదేశపు అత్యంత సంపన్న హాస్యనటుడు అని తేలింది. కపిల్ శర్మ లేదా భారతీ సింగ్ గొప్ప ఆర్జ‌కులు. అయితే ఆ ఇద్ద‌రినీ మించిన గొప్ప సంపాద‌కుడు దేశంలో ఉన్నాడు. అరుదైన గిన్నిస్ రికార్డుతో అత‌డు సంచ‌ల‌నం సృష్టించాడు. ఆయ‌న ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. భారతదేశంలోనే అత్యంత సంపన్న న‌టుడు బ్రహ్మానందం. సుప్రసిద్ధ తెలుగు నటుడిగా అత‌డు ఒక చ‌రిత్ర‌. నెలవారీ ఆర్జ‌న రూ. 2 కోట్ల కంటే ఎక్కువ. ఆయ‌న‌ మొత్తం నికర ఆస్తుల‌ విలువ సుమారు రూ. 490 కోట్లు అని గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి.

67 ఏళ్ల ఐకానిక్ స్టార్ బ్ర‌హ్మానందం ఇప్పటి వరకు 1000 చిత్రాలలో కనిపించారు. జీవించి ఉన్న న‌టుల్లో అత్యధిక సినిమాల్లో న‌టించిన న‌టుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పారు. కళకు ఆయన చేసిన కృషికి గాను 2029లో పద్మశ్రీ అందుకున్నారు. ఇప్పటికీ భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న హాస్య నటులలో బ్ర‌హ్మీ ఒకరు.

తాజా స‌మాచారం మేర‌కు.. కపిల్ శర్మ, భారతీ సింగ్ ఎంత గొప్ప సంపాద‌కులో అంత‌కంటే గొప్ప సంపాద‌కుడు బ్ర‌హ్మానందం అని విశ్లేష‌కులు చెబుతున్నారు. క‌పిల్ శ‌ర్మ‌ వంటి వారు పాపుల‌ర‌వ్వ‌క ముందే బ్రహ్మానందం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హాస్య నటులలో ఒకరిగా రికార్డుల‌కెక్కారు. బ్ర‌హ్మీ ఒక్కో సినిమా కోసం రూ. 1 కోటి నుండి రూ. 2 కోట్ల వరకు అందుకుంటారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల కోసం కోటి రూపాయల వరకు వసూలు చేస్తార‌ని స‌మాచారం ఉంది.

బ్రహ్మానందం కార్ గ్యారేజీలో బ్రాండెడ్ కార్ల విలువ చాలా ఎక్కువ‌. బ్లాక్ ప్రీమియం మెర్సిడెస్ బెంజ్‌, ఆడి R8, ఆడి Q7 ఆయ‌న సొంతం. అంతేకాకుండా కోట్లాది రూపాయ‌ల విలువ చేసే వ్యవసాయ భూమి ఆయ‌న‌కు ఉంది. బ్రహ్మానందంకు హైదరాబాద్‌లోని ప్రైమ్ ఏరియాలో సొంత ఇల్లు ఉన్నాయి. సినీప్ర‌ముఖులు నివ‌శించే మణికొండ‌లోను ఖ‌రీదైన సొంత ఇల్లును క‌లిగి ఉన్నారు. అయితే బ్ర‌హ్మానందం లాంటి ప్ర‌తిభావంతుడిని క‌లిగి ఉండ‌డటాన్ని తెలుగు ప్ర‌జ‌ల‌కు సిస‌లైన ఆస్తిగా భావిస్తారు. ఆయ‌న ఆస్తుల గురించి ఏనాడూ ఎవ‌రూ ప‌ట్టించుకున్న‌దే లేదు. ఆయ‌న తెర‌పై క‌నిపిస్తే చాలు క‌డుపుబ్బా న‌వ్వుకుని అన్నిటినీ మ‌ర్చిపోతారు. అంత గొప్ప ఛ‌రిష్మా ఆయ‌న‌కు మాత్ర‌మే ఉంది.

ఇటీవల కపిల్ శర్మ నికర ఆస్తుల‌ విలువ రూ. 300 కోట్లు అంటూ సామాజిక మాధ్య‌మాల్లో డిబేట్ సాగింది. ఆజ్‌తక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ శ‌ర్మ మాట్లాడుతూ -``నేను చాలా డబ్బు పోగొట్టుకున్నాను... కానీ, నిజం చెప్పాలంటే నేనెప్పుడూ వీటన్నింటి గురించి ఆలోచించను. నాకు ఇల్లు, కారు ఉందని నాకు తెలుసు. కుటుంబం అంతే ముఖ్యం. అయితే నేను పవిత్రుడిని కాదు. నేను మంచిగా వ‌చ్చే డబ్బును తిరస్కరించను. కానీ నేటికీ నా భార్య వస్తువులపై ఖర్చు చేయడాన్ని ఇష్టపడుతుంది. కానీ నాకు ఇష్టం లేదు. కానీ ఆమె డబ్బున్న కుటుంబం నుండి వచ్చింది. కాబట్టి త‌న ఆలోచ‌న‌ భిన్నంగా ఉంటుంది`` అని తెలిపాడు.

ఒక వడ్రంగి కొడుకు అయిన బ్ర‌హ్మానందం కాలేజ్ లెక్చరర్ గా కెరీర్ సాగించారు. అటుపై భారతదేశపు అతిపెద్ద హాస్యనటుడిగా అతని ప్రయాణం చాలా ఉత్తేజకరమైనది. బ్ర‌హ్మానందం 1985లో DD తెలుగులో `పకపకలు`తో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టాడు. శ్రీ తాతావతారం ఆయన నటించిన మొదటి సినిమా. ఆ తర్వాత సత్యాగ్రహం, అహనా పెళ్లంట స‌హా ఎన్నో చిత్రాల్లో న‌టించారు. హాస్య‌ బ్ర‌హ్మీ 35 సంవత్సరాలకు పైగా కెరీర్‌లో ఆరు రాష్ట్ర నంది అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సౌత్ .. ఆరు సినీ`మా` అవార్డులను గెలుచుకున్నాడు.