Begin typing your search above and press return to search.

ప్రముఖ నటి అనుమానాస్పద మృతి... వైరల్ అవుతున్న లాస్ట్ పోస్ట్!

మలయాళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి అపర్ణ పి.నాయర్ (31) మృతిచెందారు.

By:  Tupaki Desk   |   1 Sept 2023 12:43 PM IST
ప్రముఖ నటి అనుమానాస్పద మృతి... వైరల్ అవుతున్న లాస్ట్ పోస్ట్!
X

మలయాళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి అపర్ణ పి.నాయర్ (31) మృతిచెందారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని తన ఇంట్లో శవమై కనిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో ఇది అసహజ మరణం అంటూ కేసు నమోదైంది!

అవును... ప్రముఖ మలయాళ నటి అపర్ణా నాయర్ గురువారం సాయంత్రం తిరువనంతపురంలోని తన ఇంట్లో శవమై కనిపించింది. దీంతో పోలీసులు దీన్ని అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పొస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆమె కర్మణా తాళిలోని తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించారని అంటున్నారు. ఈ మృతిపై పలువురు పలురకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో... అపర్ణది హత్యా.. ఆత్మహత్యా అనే సందహాలు తెరపైకి వచ్చాయి. పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు.

నటి అపర్ణ పి.నాయర్.. 2009లో వచ్చిన "మేఘతీర్థం" అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాదించడంతో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే "ముదుగావ్", "ఆచయన్స్", "మైథిలీ వీందుం వరున్ను", "నిరంజనా పూక్కల్" తో పాటు "దేవస్పర్శం" వంటి పలు టెలివిజన్ సీరియల్స్ లోనూ ఆమె నటించింది.

ఆమెకు భర్త సంజీత్, ఇద్దరు కుమార్తెలు త్రయ, కృతిక ఉన్నారు. ఈ వార్తతో కుంటుంబంతోపాటు ఇండస్ట్రీలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

అయితే... ఆమె మరణానికి గంటల ముందు, అపర్ణ తన కుమార్తె ఫోటో మాంటేజ్‌ నేపథ్యంలో పాటతో పోస్ట్ చేసింది. ఆమె దానికి "నా ఉన్ని, ఉల్లాసభరితమైన చిన్నది" అనే క్యాప్షన్ ఇచ్చింది!