Begin typing your search above and press return to search.

ప్రాజెక్ట్ K - 'రైడర్స్'​ కంట్రోల్​లో కామిక్​ కాన్​ ఈవెంట్​

సోషల్​మీడియా అంతా ఎక్కడ చూసినా ప్రాజెక్ట్​​ కె

By:  Tupaki Desk   |   20 July 2023 5:29 AM GMT
ప్రాజెక్ట్ K - రైడర్స్​ కంట్రోల్​లో కామిక్​ కాన్​ ఈవెంట్​
X

ఇప్పుడు సోషల్​మీడియా అంతా ఎక్కడ చూసినా 'ప్రాజెక్ట్​​ కె' సందడి వాతావరణ కనిపిస్తోంది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమాతో పాటు ప్రభాస్​కు సంబంధించిన పోస్టర్లతో సోషల్​మీడియాను షేక్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్​ లాంఛ్​ కోసం ప్రాజెక్ట్ కె టీమ్​.. అమెరికాలోని ప్రఖ్యాత శాన్​ డీగో కామిక్ కాన్ ఈవెంట్​కు వెళ్లిన సంగతి తెలిసిందే. మరి కొన్ని గంటల్లో ఈ టైటిల్​ గ్లింప్స్​ను రిలీజ్ చేయనున్నారు. దీంతో అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్ సందడి మొదలైపోయింది. కామిక్​ కాన్​ ఈవెంట్​లో ప్రాజెక్ట్ కె సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి.

అయితే ఇక్కడ విశేషమేమిటంటే.. గతంలో 'రైడర్స్' అంటూ ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్ చేసింది ప్రాజెక్ట్ కె టీమ్​. ఈ చిత్రంలో ఈ రైడెర్సే విలన్స్​ అప్పట్లో ప్రచరాం సాగింది. ఒళ్ళంతా బ్లాక్ సూట్స్​తో.. ముఖాన్ని కూడా కవర్ చేసుకొని హాలీవుడ్ స్టైల్​లో ఉన్నారు. అయితే తాజాగా నేడు జులై 20 ఉదయం అమెరికాలోని కామిక్ కాన్​ ఈవెంట్​లో రైడర్స్​ కనిపించారు.

ఈ రైడర్స్​ అంతా.. తమ మార్క్​ గెటవ్​.. బ్లాక్ సూట్​ వేసుకుని... కామిక్ కాన్ ఈవెంట్​లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. Now Begins The End అంటూ బ్యానర్స్ పట్టుకొని ఈవెంట్ దగ్గర హడావిడి చేస్తున్నారు.

ఆ ఈవెంట్​కు వచ్చే ఆడియెన్స్​తో సరదాగా ఫొటోలు దిగుతున్నారు. అలాగే అక్కడి ఈవెంట్​ను తమ కంట్రోల్​లోకి తీసుకున్నట్లు సరదాగా డ్రామా కూడా క్రియేట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది.

ఇకపోతే పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్ హీరోగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ చిత్రమే 'ప్రాజెక్ట్ కె'. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్​తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మహా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్ బచ్చన్, హాట్​ బ్యూటీలు దీపికా పదుకొణె, దిశా పఠాని, యూనివర్స్​ స్టార్​ కమల్ హాసన్.. ఇలా పలువురు స్టార్ క్యాస్ట్ నటించడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి.

ఇప్పటికే వరుసగా రెండు రోజుల నుంచి సర్​ప్రైజ్​లు ఇస్తోంది మూవీటీమ్. మొన్న దీపికా పదుకొణె ఫస్ట్​ లుక్​ను హాలీవుడ్ స్టైల్​లో విడుదల చేసింది. ఆ తర్వాత జులై 19న ప్రభాస్​కు సంబంధించిన ఫస్ట్​ లుక్​ను విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ మార్వెల్​ హీరోలా కనిపించారు. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మరి కాసేపట్లో విడుదల కానున్న టైటిల్​ గ్లింప్స్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.