Begin typing your search above and press return to search.

హాలీవుడ్ స‌మ్మెతో `ప్రాజెక్ట్-కె` సంబంధం లేదే!

హాలీవుడ్ లో ఒక్క‌సారిగా స‌మ్మె

By:  Tupaki Desk   |   17 July 2023 11:43 AM GMT
హాలీవుడ్ స‌మ్మెతో `ప్రాజెక్ట్-కె` సంబంధం లేదే!
X

హాలీవుడ్ లో ఒక్క‌సారిగా స‌మ్మె సైర‌న్ మ్రోగిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఎక్క‌డి షూటింగ్ లు అక్క‌డ నిలిచిపోయాయి. రైటర్స్ అసోసియేషన్ తో పాటు యాక్టర్స్ కూడా సమ్మె లో పాల్గొంటున్నారు. దీంతో సినిమాల షూటింగ్ లు.. ప్రీమియర్లు.. ప్రమోషన్లు.. అన్నీ ఎక్క‌డిక్క‌డ బంద్ అయ్యాయి. హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్స్ డిస్నీ వార్నన్ బ్రదర్స్.. సోనీ.. యూనివర్శల్.. నెట్ ఫ్లిక్స్.. హెచ్ బీ వో.. లాంటి పలు సంస్థలు త‌మ యాక్ట‌విటీస్ అన్నింటిని నిలిపివేసాయి.

ఈ సంవత్సరం కామిక్ కాన్ లో పాల్గొనడం లేదని ఆ సంస్థ‌లు స్వ‌చ్ఛందంగా ప్ర‌క‌టించాయి. జులై 20 నుంచి 23 వరకూ జరుగుతున్న హాలీవుడ్ ఈవెంట్ శాన్ డియాగో కామిక్ కాన్ లో అట్ట‌హాసంగా వేడుక జ‌రుగుతుంది.

ఈ వేడుక‌లో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న 'ప్రాజెక్ట్ K' కి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తామని.. ఆ ఈవెంట్ లో పాల్గొనబోతున్నామని.. ఆ ఈవెంట్ లో పాల్గొనే ఫస్ట్ ఇండియన్ సినిమా ప్రాజెక్ట్ K అని అనౌన్స్ చేసింది యూనిట్.

మ‌రి తాజా ప‌రిస్ఠితుల్లో ప్రాజెక్ట్ కె వెన‌క్కి త‌గ్గుతుందా? అంటే ఆ ఛాన్స్ లేద‌నే వినిపిస్తోంది. ఈ సినిమాపై స‌మ్మె ప్ర‌భావం పెద్ద‌గా ఉండక‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. ఎందుకంటే ప్రభాస్.. దీపికా పదుకొనే ..కమల్ హాసన్ హాలీవుడ్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్‌లో సభ్యులు కాదు. ఈ స‌మ్మెకి వాళ్ల‌కి ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవ‌లం స్థానికంగా జ‌రిగే స‌మ్మె..మిగ‌తా ఏ భాష‌ల సినిమాకి సంబంధం లేని వ్య‌వ‌హారం.

అయితే స‌మ్మె ప్ర‌భావం కొంత‌వ‌ర‌కూ ప‌డే అవ‌కాశం ఉంది. చాలా మంది ఈవెంట్ లో పాల్గొన‌డానికి అనాస‌క్తి చూపించే అవ‌కాశం ఉంది. కార్పోరేట్ కంపెనీలు పాల్గొన‌క‌పోతే వేడుక‌లో ఉత్సాహం క‌నిపించ‌దు.

అయితే 'ప్రాజెక్ట్-కె' యూనిట్ ఇప్ప‌టివ‌ర‌కూ అయితే త‌మ ప్ర‌ద‌ర్శ‌న ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు. మ‌రి చివ‌రి నిమిష‌యంలో నిర్ణ‌యాల్లో మార్పులేమైనా వ‌స్తాయేమో చూడాలి.