Begin typing your search above and press return to search.

'ప్రాజెక్ట్ కె' కామిక్ ఆర్ట్​ వెర్షన్ వచ్చేసింది.. దీని గురించి తెలుసా?

కానీ ఈ క్రమంలోనే ఈ బుక్ ​లోని రెండు పేజీలు సోషల్​ మీడియాలో లీక్​ అయిపోయాయి. ఇప్పుడు వాటినే నిర్మాణ సంస్థ వైజయంతీ కూడా పోస్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   20 July 2023 9:09 AM GMT
ప్రాజెక్ట్ కె కామిక్ ఆర్ట్​ వెర్షన్ వచ్చేసింది.. దీని గురించి తెలుసా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ హీరోగా తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కె'ను గ్రాండ్ ​గా ప్రమోట్ చేస్తున్నారు మూవీమేకర్స్​. ఇప్పటికే ఈ సినిమాలోని ప్రభాస్, దీపికా పదుకొణె ఫస్ట్ లుక్స్ ​ను కూడా రిలీజ్ చేశారు. మార్వెల్ హీరోలా ప్రభాస్, హాలీవుడ్ హీరోయిన్ ​లా దీపిక లుక్స్​ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ గ్లింప్స్​ ను ..అమెరికా శాన్ డీగో లోని ప్రతిష్టాత్మక కామిక్ కాన్​ లో ఆవిష్కరిస్తున్నారు. మరి కొన్ని గంటల్లో(జులై 20) రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే దీని కోసం ప్రభాస్, కమల్ హాసన్, చిత్ర నిర్మాత అశ్వినీ దత్​ అందరూ అక్కడికీ చేరుకున్నారు.





ప్రస్తుతం కామిక్ కాన్ ఈవెంట్ సందడి మొదలైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిని ఇండస్ట్రీ ప్రముఖులంతా అక్కడికి చేరుకుని సందడి చేస్తున్నారు. ముఖ్యంగా సినీ లవర్స్​, కామిక్ బుక్స్ అభిమానులు ఈ ఈవెంట్​కు చేరుకుని ఈవెంట్​ను ఆస్వాదిస్తారు. 'ప్రాజెక్ట్ కె' టీమ్​ కూడా తమ రైడర్స్​ తో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆడియెన్స్​తో మమేకమై సినిమాను వాళ్లలోకి తీసుకెళ్తున్నారు.





ఇక ఈ ఈవెంట్​ లో ప్రభాస్, కమల్​ హాసన్​ గ్రాండ్ ఎంట్రీ కూడా అదిరిపోయింది. వీటిన్నింటికీ సంబంధించిన అప్డేట్స్​ ను ఎప్పటికప్పుడు నిర్మాణ సంస్థ తన అధికార సోషల్​ మీడియా అకౌంట్​లోనే పోస్ట్​ చేస్తోంది. అభిమానుల్లో ఫుల్​ జోష్ నింపుతోంది. దీంతో సోషల్​మీడియా అంతా ప్రాజెక్ట్​ కె రచ్చే కొనసాగుతోంది. వాటికి సంబంధించిన విషయాలు, ఫొటోలు, పోస్టర్లు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఇప్పుడు కామిక్ కాన్ ఈవెంట్​ లో 'ప్రాజెక్​ కె' టీమ్​.. తమ సినిమాను కామిక్​ బుక్​ వెర్షన్​లో విడుదల చేయనుందని తెలిసింది. కానీ ఈ క్రమంలోనే ఈ బుక్ ​లోని రెండు పేజీలు సోషల్​ మీడియాలో లీక్​ అయిపోయాయి. ఇప్పుడు వాటినే నిర్మాణ సంస్థ వైజయంతీ కూడా పోస్ట్ చేసింది. ప్రాజెక్ట్ కె కామిక్ ఆర్ట్​ వెర్షన్​ అంటూ రాసుకొచ్చింది. ఇక వీటిని చూసిన వారు సినిమా కథ ఇదే అంటూ చెబుతున్నారు.

కలియుగం చివర్లో ప్రజలను ఇబ్బంది పెట్టే రాక్షకుడు ఉంటాడని, అతడిని సంహరించేందుకు దేవుడిలా ప్రభాస్ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. విలన్​గా కమల్ హాసన్ కనిపిస్తారని చెబుతున్నారు. దీన్ని హాలీవుడ్​ స్టైల్ ​లో దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్​ తో వైజయంతీ మూవీస్​ నిర్మిస్తోంది. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్ బచ్చన్, హాట్ బ్యూటీలు దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్.. పలువురు స్టార్ కాస్ట్ ఇందులో నటిస్తున్నారు.