Begin typing your search above and press return to search.

ఆలేఖ్య హారిక - సంతోష్ శోభన్.. ఘాటైన ముద్దులో..

ప్రొడక్షన్ 4 లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమెకు జోడిగా యువ హీరో సంతోష్ శోభన్ కనిపించబోతున్నాడు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 9:01 AM GMT
ఆలేఖ్య హారిక - సంతోష్ శోభన్.. ఘాటైన ముద్దులో..
X

బేబీ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న కాంబినేషన్ మరోసారి వరుస సినిమాలను లైన్ లోకి తీసుకువస్తుంది. ఇప్పటికే రెండు ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత SKN & సాయి రాజేష్ కాంబినేషన్ ఇప్పుడు మరొక క్రేజీ ప్రాజెక్టును మొదలు పెట్టింది. ఇక ఈ సినిమాను లాంచ్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలిచేలా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు.


ఈ సినిమా బేబీ తరహా ఎనర్జిలోనే స్టార్ట్ చేశారు. యూట్యూబ్ ద్వారా క్రేజ్ అందుకున్న వైష్ణవి చైతన్య క్రేజ్ బేబీ సినిమాకు బాగానే హెల్ప్ అయ్యింది. ఇక ఇప్పుడు మరొక యూట్యూబర్ అలేఖ్య హారికను కూడా రంగంలోకి దింపుతున్నారు. ప్రొడక్షన్ 4 లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమెకు జోడిగా యువ హీరో సంతోష్ శోభన్ కనిపించబోతున్నాడు. సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నేడు హైదరాబాద్ లోనే ఒక టెంపుల్ లో నిర్వహించారు.


నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యానర్ అమృత ప్రొడక్షన్స్ తో మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. కొన్ని ప్రేమకథలు జీవితాంతం వెంటాడుతాయి.. అనే లైన్ తో రిలీజ్ చేసిన పోస్టర్లో అలేఖ్య హారిక సంతోష్ లిప్ లాక్ స్టిల్ ను హైలెట్ చేశారు. చూస్తుంటే ఇది కూడా ఎమోషనల్ ప్రేమ కథలా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక యువసామ్రాట్ నాగచైతన్య క్లాప్‌తో ఈ చిత్రం ప్రారంభమైంది. అలాగే నాగచైతన్య యూనిట్ సభ్యులందరికీ కూడా తన విషెస్ అందిస్తూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలి అని తెలియజేశారు. నాగచైతన్య లుక్ కూడా ఈ లాంచ్ వేడుకల్లో చాలా హైలెట్ గా నిలిచింది. ఇక వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ స్క్రిప్ట్‌ను అందజేశారు.

దర్శకుడు చందూ మొండేటి కెమెరా స్విచాన్ చేయగా... వశిష్ట మల్లిడి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. హీరో సుశాంత్, దర్శకులు హను రాఘవపూడి, రాహుల్ సాంకృత్యాన్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సాయి రాజేష్ రాసిన కథ, కథనంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా నటించిన ఈ చిత్రం కూడా బేబీ తరహాలో మెమరబుల్ లవ్ స్టోరీ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.