Begin typing your search above and press return to search.

బయోపిక్ సినిమా తీసి, ఆస్పత్రిలో నిర్మాత...!

ఈ నిర్మాత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో ప్రేరణ పొంది స్వతంత్రం కోసం చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఓ మహనీయుడి పై బయోపిక్ తీశారు

By:  Tupaki Desk   |   18 Aug 2023 11:25 AM GMT
బయోపిక్ సినిమా తీసి,  ఆస్పత్రిలో నిర్మాత...!
X

సినీ నిర్మాత విజయ్ జాగర్లమూడి ఆస్పత్రి పాలయ్యారు. ఈ నిర్మాత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో ప్రేరణ పొంది స్వతంత్రం కోసం చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఓ మహనీయుడి పై బయోపిక్ తీశారు. అయితే, ఆ సినిమాని విడుదల చేయడానికి భారాన్ని తట్టుకోలేక గుండెపోటుకు గురయ్యారు.


ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆయన తీసిన సినిమా పేరు ఖుదీరామ్ బోస్. స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఖుదీరామ్ బోస్ ఆయన జీవిత కథ ఆధారంగా ఈ మూవీని చిత్రీకరించారు. గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ జాగర్ల మూడీ ఈ చిత్రాన్ని నిర్మించారు.


తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని అనుకున్నారు. విడుదలకు ముందే ఈ సినిమాని గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించారు. ఈ మూవీకి మంచి స్పందన కూడా వచ్చింది. 2022 డిసెంబర్ 22న ఈ సినిమాని పార్లమెంట్ లో ప్రదర్శించారు. వారికి కూడా ఈ సినిమా బాగా నచ్చింది. అందరూ ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు.


కానీ, థియేటర్స్ కి మాత్రం నోచుకోలేకపోయింది. థియేటర్ లో రిలీజ్ చేసి ఉంటే, కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టు పడేది. కానీ, అది జరగలేదు. నిర్మాత విజయ్ ఈ సినిమా కోసం చాలా ఖర్చు చేశాడు. కానీ విడుదల కాకపోవడంతో అతనికి రూపాయి కూడా రాలేదు. దీంతో మానసికంగా కుంగిపోయి ఆయన తన ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది. ఆయన తొందరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.


కాగా, ఈ సినిమా చాలా మంది ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేశారు. ఈ సినిమా కి మణిశర్మ మ్యూజిక్ అందించారు. ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ తోట త‌ర‌ణి, స్టంట్ డైరెక్ట‌ర్‌గా క‌న‌ల్ క‌న్న‌న్‌ లాంటి వారు పని చేశారు. అలాంటి సినిమా కనీసం విడుదలకు నోచుకోకపోవడం బాధాకరం.