Begin typing your search above and press return to search.

దీపిక ఫ్రెగ్నెన్సీతో నిర్మాతల‌కు ట్ర‌బుల్స్

ఇప్పుడు దీపికా పదుకొణె ప్రసూతి సెలవుల వ‌ల్ల‌ బాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌ కరణ్ జోహార్ తదుపరి చిత్రాన్ని ఆపేసాడ‌ని తెలిసింది.

By:  Tupaki Desk   |   5 March 2024 12:30 PM GMT
దీపిక ఫ్రెగ్నెన్సీతో నిర్మాతల‌కు ట్ర‌బుల్స్
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొనే ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు ర‌ణ‌వీర్ సింగ్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట ఇప్పుడు త‌మ మొద‌టి సంతాన వార్త‌ను అధికారికంగా ధృవీకరించారు. త్వ‌ర‌లో తాము త‌ల్లిదండ్రులు కాబోతున్నామ‌ని ప్ర‌క‌టించ‌గానే ఇది దావాన‌లంలా మారింది.

ముఖ్యంగా సెట్స్ పై ఉన్న సినిమాల సంగతేంటి? అంటూ ఒక‌టే డిష్క‌స‌న్ మొద‌లైంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న 'క‌ల్కి' చిత్రంలోను దీపిక క‌థానాయిక‌. ఈ ప్రాజెక్ట్ లో త‌న పాత్ర చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసిందా? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు.

ఇప్పుడు దీపికా పదుకొణె ప్రసూతి సెలవుల వ‌ల్ల‌ బాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌ కరణ్ జోహార్ తదుపరి చిత్రాన్ని ఆపేసాడ‌ని తెలిసింది. క‌ర‌ణ్ చాలా కాలంగా దీపిక కోసం వేచి చూస్తున్నాడు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్ర‌తిదీ సిద్ధ‌మైంది. కానీ ఇప్పుడు మ‌న‌సు మార్చుకోవాల్సి వ‌చ్చింది. అయితే అత‌డు దీపిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణ‌యించుకున్నారు.

కరణ్ జోహార్ రచయిత ఆధారిత చిత్రం కోసం దీపికను ఎంపిక చేసుకున్నారు. దీపిక ఈ సబ్జెక్ట్‌ని ప్రేమిస్తుంది. అయితే ఇప్పుడున్న స్థితిలో త‌న కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని కరణ్‌తో దీపిక చెప్పింది. అయితే దీపిక ప‌దుకొనే మాతృత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నందున తాను కోరుకున్నంత కాలం వేచి చూస్తానని క‌ర‌ణ్ చెప్పార‌ట‌.

దీపికతో ప్రాజెక్ట్ విషయానికొస్తే తాను తొందరపడాల్సిన అవసరం లేదని కరణ్ చెప్పాడు. ప్ర‌స్తుతం అతడికి చాలా ఇతర ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. క‌థానాయిక‌ల ప్రసూతి స‌మ‌యంలో రాజీకి రావ‌డం కరణ్ కి కొత్తేమీ కాదు. గ‌తంలో అలియా భట్ పై కాశ్మీర్‌లో ఒక పాటను చిత్రీకరించడానికి దాదాపు ఒక సంవత్సరం పాటు వేచి చూసాడు. 'రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ'ని వాయిదా వేసాడు.

కేవ‌లం తెలుగు, హిందీ సినిమాల‌కే కాదు.. అటు హాలీవుడ్ కమిట్ మెంట్ల‌కు కొన్ని ఇబ్బందులు త‌లెత్తాయ‌ని చెబుతున్నారు. అమెరికన్ సిరీస్ 'ది వైట్ లోటస్' నిర్మాతలు దీపికా పదుకొణె తన ప్రసూతి సెలవును ముగించి సీజన్ 3 కోసం వారితో చేరే వరకు వేచి ఉండే అవకాశం లేకపోలేదని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.