Begin typing your search above and press return to search.

'బాహుబ‌లి' బ్రాండ్ తో మ‌రిన్ని వండ‌ర్స్!

'బాహుబ‌లి' బ్రాండ్ తో మ‌రిన్ని వండ‌ర్స్ చేయాల‌నే ఆలోచ‌న‌తో నిర్మాత‌లు ముందుకు క‌దులుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   8 May 2024 12:49 PM GMT
బాహుబ‌లి బ్రాండ్ తో మ‌రిన్ని వండ‌ర్స్!
X

ద‌ర్శ‌క శిఖ‌రం రాజ‌మౌళి బిజినెస్ స్ట్రాట‌జీ ఎవ‌రికీ అంద‌నిది. సినిమా తీయ‌డ‌మే కాదు. ఆ సినిమాని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డం..మార్కెట్ చేయ‌డం..రిలీజ్ చేయ‌డం వ‌ర‌కూ ప్ర‌తీది ఓ ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతుంది. ఆ ప్రాస‌స్ లో ఇంత వ‌ర‌కూ ఆయ‌న‌కు వైఫ‌ల్య‌మ‌న్న‌దే తెలియ‌దు. 'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' చిత్రాలు అలా రిలీజ్ అయిన‌వే. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు కావ‌డంతో అదే రేంజ్ లో ప్ర‌చారం చేసి గ్రాండ్ విక్ట‌రీలు న‌మోదు చేసారు. ముఖ్యంగా 'బాహుబ‌లి' కంటెంట్ ని ఆయ‌న ఎన్నిర‌కాలుగా బిజినెస్ చేసారో తెలిసిందే.

'బాహుబ‌లి' పాత్ర‌ధారుల కాస్ట్యూమ్స్ మార్కెట్ లో అందుబాటులో తీసుకొచ్చి మంచి లాభాలు అర్జించారు. అటుపై వివిధ గేమింగ్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకుని బాహుబ‌లి గేమింగ్ ని సైతం ఇంట‌ర్నెట్ లో అందుబాటులోకి తెచ్చారు. అందులో మ‌ళ్లీ సాంగ్ ప్లే ప్ర‌త్యేక‌మైన‌ది. తాజాగా 'బాహుబ‌లి' యానిమేష‌న్ వెర్ష‌న్ కూడా తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి అందుబాటులోకి రానుంది. దీనికంటే ముందు 'బాహుబ‌లి' పాత్ర‌ల‌తో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.

దేవ‌క‌ట్టా..ప్ర‌వీణ్ స‌త్తారు కొన్ని ఎపిసోడ్ లు కూడా డైరెక్ట్ చేసారు. కానీ ఔట్ ఫుట్ స‌రిగ్గా రాక‌పోవ‌డంతో దాన్ని మ‌ధ్య‌లోనే ఆపేసారు. ఆ కార‌ణంగా నిర్మాత‌లు కొంత న‌ష్టాల్ని చూసారు. ఈనేప‌థ్యంలో నేరుగా రాజ‌మౌళిని ఈ వెబ్ సిరీస్ బాధ్య‌త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఆర్కా మీడియా వెబ్ సిరీస్ ని మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించింద‌ని స‌మాచారం. 'బాహుబ‌లి' బ్రాండ్ తో మ‌రిన్ని వండ‌ర్స్ చేయాల‌నే ఆలోచ‌న‌తో నిర్మాత‌లు ముందుకు క‌దులుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.

నెట్ ఫ్లిక్స్ లోనే ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. దానికి సంబంధించిన స‌మాచారాన్ని త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఇది గ‌నుక క్లిక్ అయితే రాజ‌మౌళి ని స్పూర్తిగా తీసుకుని మ‌రింత మంది ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆయ‌న కార‌ణంగా పాన్ ఇండియాలో సినిమాలు చేయాల‌నే ఆలోచ‌న చాలా మంది ద‌ర్శ‌కుల్లో క‌లిగింది. కాబ‌ట్టి ఈ ఐడియాని కూడా కాపీ కొట్ట‌డానికి కొంత మంది క్యూలోనే ఉంటారు.