Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్‌ 'ఫుల్‌ ట్యాంక్‌' ట్రోల్స్‌.. SKN కౌంటర్‌

ఆ సినిమా తర్వాతే నేను నా బండి ఫుల్ ట్యాంక్ చేయించాను అంటూ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

By:  Tupaki Desk   |   4 April 2024 7:09 AM GMT
రౌడీ స్టార్‌ ఫుల్‌ ట్యాంక్‌ ట్రోల్స్‌.. SKN కౌంటర్‌
X

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌' రిలీజ్ కు సిద్దం అయ్యింది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా ప్రమోషనల్‌ చిట్ చాట్‌ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన కుటుంబం మరియు గతంలో తన ఆర్థిక పరిస్థితి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పెళ్లి చూపులు హిట్ అయ్యే వరకు తన ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ సినిమా తర్వాతే నేను నా బండి ఫుల్ ట్యాంక్ చేయించాను అంటూ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

విజయ్ దేవరకొండ ఫుల్‌ ట్యాంక్‌... వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో చాలా దారుణమైన కామెంట్స్ వస్తున్నాయి. చిన్నప్పటి నుంచి కూడా మీ ఫ్యామిలీ బాగా డబ్బు ఉన్న ఫ్యామిలీ. మీ అమ్మ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాది దొరల ఫ్యామిలీ అన్నారు. అంటూ అప్పటి వీడియో ని షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పై ఒక వ్యక్తి.. సినిమా ప్రమోషన్ కోసం ఇలా మాట్లాడుతున్నారు. ఆయన మొదటి నుంచి కూడా రిచ్ కిడ్‌ అంటూ కామెంట్‌ చేశాడు. సదరు నెటిజన్‌ కామెంట్‌ కి 'బేబీ' చిత్ర నిర్మాత ఎస్‌కేఎస్‌ స్పందించాడు.

ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ... శ్రీనగర్ కాలనీలో మా ఇంటికి దగ్గర్లోనే ఒక రెంటెడ్‌ ఫ్లాట్‌ లో విజయ్‌ ఫ్యామిలీ ఉండేది. చాలా కష్టపడి విజయ్‌ పైకి వచ్చాడు. అలా కష్టపడి పైకి వచ్చిన వారు ఆ విషయాన్ని చెప్పుకోవడంలో సంతృప్తి చెందుతారు. వారు చెప్పే మాటలను ఆదర్శంగా తీసుకోకున్నా పర్వాలేదు కానీ ఇలా విమర్శలు చేయడం సరి కాదు అంటూ కౌంటర్ ఇచ్చాడు.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ సినిమాలపై ఇష్టంతో చాలా కాలం పాటు ఇండస్ట్రీ ఆఫీస్ ల చుట్టూ తిరిగాడు. ఆ సమయంలో ఆయన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆనంద్‌ దేవరకొండ జాబ్‌ చేసి కుటుంబం యొక్క మెయింటనెన్స్ చూసుకునే వారట. ఎవరు ఏం అన్నా కూడా రౌడీ స్టార్‌ కచ్చితంగా కింది నుంచి వచ్చిన వ్యక్తి అంటూ రౌడీ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.