Begin typing your search above and press return to search.

బాయ్స్ హాస్ట‌ల్లో ర‌ష్మీ ఫోటోలు అంటించి ఉన్నాయ్

తాజాగా ఓ లైవ్ వేడుక‌లో బేబి నిర్మాత ఎస్.కే.ఎన్ ప్ర‌ముఖ యాంక‌ర్ రేష్మి పై చేసిన ఓ కామెంట్ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   20 Aug 2023 5:38 AM GMT
బాయ్స్ హాస్ట‌ల్లో ర‌ష్మీ ఫోటోలు అంటించి ఉన్నాయ్
X

ప‌బ్లిక్ లో లైవ్ వేడుక‌ల్లో మాట్లాడేప్పుడు ఏదైనా పంచ్ ఉంటేనే యూత్ లో జోష్ పాజిబుల్. తాజాగా ఓ లైవ్ వేడుక‌లో బేబి నిర్మాత ఎస్.కే.ఎన్ ప్ర‌ముఖ యాంక‌ర్ రేష్మి పై చేసిన ఓ కామెంట్ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. వేదిక‌పై ఎస్.కే.ఎన్ చేసిన కామెంట్ కి రేష్మి ఎంతో షాక్ కి గురైంది. అంతేకాదు.. రేష్మితో పాటు త‌న ప‌క్క‌నే నిలుచుని ఉన్న బేబి హీరోయిన్ వైష్ణ‌వి పైనా ఎస్.కే.ఎన్ వ్యాఖ్య‌లు వేడెక్కించాయి. ఆ క్ష‌ణం వైష్ణ‌వి ముఖంలోను ఎక్స్ ప్రెష‌న్స్ మారాయి.

ఇంత‌కీ లైవ్ లో జ‌నం అంత‌గా ఆశ్చ‌ర్య‌పోయేలా ఎస్.కే.ఎన్ ఏమ‌ని కామెంట్ చేసారు? అంటే.. చిన్న‌ప్పుడు నాకు గ‌ర్ల్స్ హాస్ట‌ల్లో ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే ఎగ్జ‌యిట్ మెంట్ ఉండేద‌ని.. బోయ్స్ హాస్ట‌ల్ గురించి మ‌న‌కు తెలిసిన‌దే క‌దా అని వ్యాఖ్యానించిన ఎస్.కే.ఎన్.. కాలేజీల్లో బోయ్స్ హాస్ట‌ల్లో రేష్మి ఫోటోలు అంటించి ఉన్నాయ్! అని అన్నారు. ఇక నుండి ర‌ష్మితో పాటు బేబి వైష్ణ‌వి పోస్ట‌ర్ల‌ను బోయ్స్ హాస్ట‌ల్లో అతికించాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు. దీంతో రేష్మి.. వైష్ణ‌వి ఎంతో ఆశ్చ‌ర్య‌పోయారు. ఇంత‌కీ మీ ఇంట్లో ఎవ‌రి ఫోటో ఉంది? అని ప్ర‌శ్నించ‌గా.. వారంలో ప్ర‌తి రోజు ఒక్కో ఫోటో మారుతుంద‌ని ఎస్.కే.ఎన్ అన్నారు.

అనువాద చిత్రం బాయ్స్ హాస్ట‌ల్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో ఎస్.కే.ఎన్ పైవిధంగా కామెంట్ చేసారు. అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిలింస్ సంయుక్తంగా కన్నడలో సంచలనం సృష్టించిన `హాస్టల్ హుడుగారు బేకగిద్దారే` తెలుగులో `బాయ్స్ హాస్టల్` పేరుతో ఈ నెల 26న విడుదలకు సిద్ధమైంది. తెలుగు నటులు- తరుణ్ భాస్కర్ .. రష్మీ గౌతమ్ ఇందులో న‌టించారు. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి సహా ప‌లువురు ఇందులో అతిధి పాత్రల్లో న‌టించారు.