Begin typing your search above and press return to search.

టాలీవుడ్ నిర్మాత SKN బాలీవుడ్‌కి

సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సక్సెస్ అవ్వొచ్చు. కానీ విజయం ఎవరికీ అంత తేలికగా రాదు. విజయాన్ని సాధించడానికి కొంత‌ కష్టపడాలి

By:  Tupaki Desk   |   6 Nov 2023 4:04 PM GMT
టాలీవుడ్ నిర్మాత SKN బాలీవుడ్‌కి
X

సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సక్సెస్ అవ్వొచ్చు. కానీ విజయం ఎవరికీ అంత తేలికగా రాదు. విజయాన్ని సాధించడానికి కొంత‌ కష్టపడాలి. అయితే మారుతున్న కాలంతో పాటు హార్డ్ వర్క్ సోషల్ మీడియాల్లో సులువుగా ప్ర‌చారం పొందుతోంది. ఇటీవ‌లి సంచలనాత్మక బ్లాక్‌బస్టర్ బేబీ సినిమా నిర్మాత ఎస్‌కెఎన్ అలాంటి ఒక ఉదాహరణ. అతడు టాలీవుడ్ లో పీఆర్వోగా ప‌ని చేసి నిర్మాత‌గా ఎదిగాడు.

SKN పూర్తి పేరు శ్రీనివాస కుమార్. అత‌డు మెగా కుటుంబానికి చెందిన అనేక మంది అభిమానులలో ఒకడు. అల్లు శిరీష్ అత‌డిని గుర్తించాడు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండ‌టం..సినిమాల‌పై అతడి ప్రేమ.. ఆ తర్వాత పీఆర్వోగా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో విజ‌య‌వంత‌మైన‌ ప్రయాణం మొదలుపెట్టారు. అతడు స్మాల్-టైమ్ ఫిల్మ్ జర్నలిస్ట్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా పనిచేశాడు. ఇప్పుడు ప్రధాన నిర్మాతగా తన మొదటి చిత్రం బేబీతో బ్లాక్‌బస్టర్‌ని సాధించాడు. ప్రస్తుతం అతడు తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్. నిజంగా SKN ప్రయాణం ఔత్సాహిక చిత్రనిర్మాతలకు స్ఫూర్తిదాయకం.

విజయ్ దేవరకొండ -ఆనంద్ దేవరకొండ (టాక్సీవాలా మరియు బేబీ)లతో బ్లాక్‌బస్టర్‌లు సాధించిన ఎస్‌కెఎన్ దేవరకొండ కుటుంబానికి అదృష్ట నిర్మాతగా మారారు. ఇప్పుడు చాలా మంది హీరోలు ఫ్యూచర్‌లో ఎస్‌కెఎన్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో ఎస్‌కెఎన్ చాలా దూకుడుగా వ్యవహరిస్తారని వారు నమ్ముతారు. అత‌డు నిర్మాణంలో ప్రణాళిక ప్రకారం అన్ని పనులను నిర్వహిస్తాడు. అతడు విజయవంతమైన ప్రయాణం మాత్రమే కాదు.. SKN దర్శకులు మారుతీ, రాహుల్ సంకృత్యాన్, సాయి రాజేష్ వంటి ట్యాలెంట్ ను కూడా కనుగొన్నాడు. ఇప్పుడు ఎస్‌కేఎన్ అని వార్తలు వస్తున్నాయి. జాతీయ అవార్డు గెలుచుకున్న కలర్ ఫోటో ఫిలిం దర్శకుడు సందీప్ రాజ్ తో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అతడు చేసే మరో మంచి పని తన సినిమాల్లో తెలుగు హీరోయిన్లను పరిచయం చేయడం.

ఇప్పుడు ఎస్.కే.ఎన్ మ‌రో అడుగు ముందుకు వేసాడు. అత‌డు బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ బేబి ని హిందీలో రీమేక్ చేయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని 'కోట బొమ్మాళి పి.ఎస్' టీజ‌ర్ లాంచ్ వేడుక‌లో ముఖ్య అతిథి అల్లు అర‌వింద్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఎస్.కే.ఎన్ త్వ‌ర‌లోనే బాలీవుడ్ నిర్మాత‌గాను ఎదిగేయ‌బోతున్నాడని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.