Begin typing your search above and press return to search.

SKN ని ఆడేసుకుంటున్న ట్రోలర్స్..!

సినిమా హిట్ కొట్టిన ఆనందంలో

By:  Tupaki Desk   |   21 July 2023 5:40 AM GMT
SKN ని ఆడేసుకుంటున్న ట్రోలర్స్..!
X

తాను నిర్మించిన ఒక సినిమా సక్సెస్ అవ్వడం పట్ల ఒక నిర్మాత ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. మిడిల్ క్లాస్ మ్యాన్ అయిన ఎస్.కె.ఎన్ మెగా అభిమానిగా అల్లు శిరీష్ దృష్టిలో పడి ఇరవై ఏళ్ల క్రితం అల్లు అర్జున్ రమ్మంటే హైదరాబాద్ వచ్చేశాడు. అప్పటి నుంచి జర్నలిస్ట్ గా.. పి.ఆర్ గా చేస్తూ ఫైనల్ గా నిర్మాతగా కెరీర్ సెట్ చేసుకున్నాడు. ఎస్.కె.ఎన్ నిర్మించిన బేబీ సినిమా రీసెంట్ గా రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది.

సినిమా హిట్ కొట్టిన ఆనందంలో రీసెంట్ గానే తొడకొట్టి మైక్ విసిరేసిన ఎస్.కె.ఎన్ అప్పుడే ట్రోలర్స్ కి దొరికిపోగా.. లేటెస్ట్ గా బేబీ సినిమా కోసం అల్లు అర్జున్ స్పెషల్ గా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో కూడా మరోసారి ట్రోలర్స్ కి దొరికిపోయేలా మాట్లాడారు.

ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలని మాట్లాడతాడో.. లేక తనలోని రైటింగ్ టాలెంట్ చూపించాలని అనుకుంటాడో కానీ ఎస్.కె.ఎన్ మైక్ అందుకున్నాడు అంటే స్పీచ్ అదిరిపోవాల్సిందే. లేటెస్ట్ గా జరిగిన బేబీ ఈవెంట్ లో కూడా ఏలూరు నుంచి తను హైదరాబాద్ కి వచ్చిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. నువ్వేమన్నా ఇంటర్ స్టెల్లర్ తీశావా ఇంత సంబరపడుతున్నావ్ అంటే.. సెల్లర్ కూడా లేని వాడిని ఇంటర్ స్టెల్లర్ సినిమాతో తనని పోల్చుకున్నారని అన్నాడు.

ఇక ఆ తర్వాత ఇంటర్ స్టెల్లర్ తీసిన స్టీఫెన్ స్పీల్ బర్గ్ కూడా ఆ సినిమా సక్సెస్ కి ఇంతే సంతోష పడి ఉంటాడని అన్నారు. ఈ సినిమా సక్సెస్ ఇప్పుడే ఎంజాయ్ చేయాలని 10 సినిమా అప్పుడు చేయలేమని అన్నారు.

అయితే అంతా బాగానే ఉంది కానీ పొరపాటున ఎస్.కె.ఎన్ ఇంటర్ స్టెల్లర్ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్బర్గ్ అన్నారు కానీ అది డైరెక్ట్ చేసింది క్రిస్టోఫర్ నోలన్. తెలిసి అన్నాడో తెలియక అన్నాడో తెలియదు కానీ ఎస్.కె.ఎన్ చెప్పిన ఈ కామెంట్ తో ట్రోలర్స్ మరోసారి అతన్ను ఆడేసుకుంటున్నారు.

సినిమా హిట్ కొట్టిన ఆనందంలో అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ నిర్మాతగా తను పడిన కష్టానికి వచ్చిన ఈ ఫలితాన్ని ఎంజాయ్ చేయడం వరకు బాగానే ఉన్నా మైక్ అందుకుని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే మీమ్స్, ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోవాల్సి వస్తుంది. బేబీ సినిమా సక్సెస్ హంగామా ఒక పక్క జరుగుతుంటే ఆ సినిమా నిర్మాత ఎస్.కె.ఎన్ మీద మీమ్స్, ట్రోల్స్ కూడా అదే రేంజ్ లో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి.