Begin typing your search above and press return to search.

నేను అడ్వాన్స్ గా ఆలోచించే ప్రొడ్యూసర్- నిర్మాత ఎస్కేఎన్

అలాగే తాను అడ్వాన్స్ లు ఇచ్చే ప్రొడ్యూసర్ ని కాదని, అడ్వాన్స్ గా ఆలోచించే నిర్మాతని అంటూ ఎస్కేఎన్ చెప్పడం విశేషం.

By:  Tupaki Desk   |   18 July 2023 4:23 AM GMT
నేను అడ్వాన్స్ గా ఆలోచించే ప్రొడ్యూసర్- నిర్మాత ఎస్కేఎన్
X

టాక్సీవాలా మూవీతో నిర్మాతగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఎస్కేఎన్ తాజాగా బేబీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మూవీ మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఎవెన్ అందుకోవడం విశేషం. ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో షార్ట్ ఫిల్మ్ యాక్టర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా టర్న్ తీసుకుంది.

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ బేబీ చిత్రంలో హీరోలుగా నటించారు. ఓ విధంగా చెప్పాలంటే ముక్కోణపు ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం అయిన ఫిమేల్ సెంట్రిక్ గానే ఈ స్టొరీ నడుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఇందులో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆనంద్ దేవరకొండ ట్యాక్సీవాలా టైమ్ లో షూటింగ్ లొకేషన్ కి వచ్చేవాడు.

అప్పుడే అతనితో సినిమా చేస్తానని చెప్పడం జరిగింది. ఆ సమయానికి ఆనంద్ హీరోగా పరిచయం కాలేదు. అలాగే సాయి రాజేష్ తో నా ప్రయాణం 20 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయ్యింది. మా ఇద్దరి ట్రావెలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యిందంటే దానికి కారణం పూర్తిగా సాయి రాజేష్ అని చెప్పాలి.

తన సినిమాలకి తెలుగమ్మాయిలు అయితే బాగుంతారని బేబీ చిత్రానిని వైష్ణవిని తీసుకోవడం జరిగింది. అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్న సమయంలోనే ఆమెకి హీరోయిన్ చేస్తానని చెప్పాను. ఈ రోజు మూవీకి ఆమె మెయిన్ పిల్లర్ గా మారింది. తన ప్రయాణంలో తోడుగా ఉన్న అల్లు అరవింద్, బన్నీ వాస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు అని ఎస్కేఎన్ చెప్పుకొచ్చారు.

అలాగే తాను అడ్వాన్స్ లు ఇచ్చే ప్రొడ్యూసర్ ని కాదని, అడ్వాన్స్ గా ఆలోచించే నిర్మాతని అంటూ ఎస్కేఎన్ చెప్పడం విశేషం. సాయి రాజేష్ తనకి టైమ్ ట్రావెల్ కథ ఒకటి చెప్పారని, ఆ కథ చెప్పిన తర్వాత అతనితో లవ్ లో పడిపోయా అంటూ చెప్పుకొచ్చారు.

ఇక అడ్వాన్స్ గా ఆలోచించే ప్రొడ్యూసర్ అని ఎస్కేఎన్ చెప్పడం ద్వారా ఈ మధ్యకాలంలో దర్శకులకి ఒక సక్సెస్ రాగానే అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసుకుంటున్న నిర్మాతలని కౌంటర్ వేసినట్లు ఉందనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.