Begin typing your search above and press return to search.

తాట తీస్తా.. రూమర్స్ పై ఫైర్ అయిన దిల్ రాజు

సంక్రాంతి వచ్చిందంటే టాలీవుడ్ సినిమాల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. ఆ డేట్స్ విషయంలో ఎవరూ తగ్గడానికి ఇష్టపడరు

By:  Tupaki Desk   |   8 Jan 2024 12:54 PM GMT
తాట తీస్తా.. రూమర్స్ పై ఫైర్ అయిన దిల్ రాజు
X

సంక్రాంతి వచ్చిందంటే టాలీవుడ్ సినిమాల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. ఆ డేట్స్ విషయంలో ఎవరూ తగ్గడానికి ఇష్టపడరు. దిల్ రాజు నుంచి అయితే నిర్మాతగానో, లేదంటే డిస్టిబ్యూటర్ గానో సినిమాలు వస్తూ ఉంటాయి. దీంతో సాధారణంగానే పెద్ద నిర్మాతగా ఉండటం వలన చాలా మంది ఫోకస్ ఆయన పైనే ఉంటుంది. ఇక ఈసారి కూడా దిల్ రాజు సంక్రాంతి సినిమాల విషయంలో క్లాష్ లేకుండా ఉండలని చర్చలు జరపగా అది కూడా హాట్ టాపిక్ గా నిలిచింది.

తనపై వచ్చి రూమర్స్ కు దిల్ రాజు మొదటిసారి కాస్తా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. రిలీజ్ అవుతున్నప్పుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నాపైన కొంతమంది పనిగట్టుకొని విమర్శలు చేస్తూ ఉంటారు. కష్టపడి ఎదిగి ఇండస్ట్రీలో ఈ పొజిషన్ లో ఉన్నందుకు ఏదో ఒక రకంగా నా మీద కాంట్రవర్శి క్రియేట్ చేస్తూ రాళ్లు వేస్తూనే ఉన్నారు. గత 7, 8 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది.

హనుమాన్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి గారు మాట్లాడుతూ, దిల్ రాజుకి అన్ని తెలుసు. దేనికి ఎలా చేయాలి అనేది పూర్తిగా అవగాహన, అనుభవం ఉన్న వ్యక్తి అని అన్నారు. కానీ ఈ రోజు కొంతమంది వెబ్ సైట్స్ లో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు వక్రీకరించి రాశారు. రెండు ప్రముఖ వెబ్ సైట్స్ లో తప్పుడు కథనాలు రాశారు.

మీరు నా పైన ఏదో రాసి, కాంట్రవర్సీ క్రియేట్ చేసి మీ వెబ్ సైట్స్ ప్రాధాన్యత పెంచుకోవడానికి వేరే వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నారు. ఏం రాసిన దిల్ రాజు రియాక్ట్ అవ్వడు. సాఫ్ట్ గా వెళ్తాడు అనుకుంటున్నారా? తాటతీస్తా… చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్న. సాఫ్ట్ గా వెళ్దామని ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. అయిన నన్ను టార్గెట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ ఏమైనా మీతో మాట్లాడాడా.. అస్సలు సంబంధం లేకుండా రాశారు.

మీకు అంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ ని నన్ను ఈ స్టేజ్ మీదకి పిలిచి కూర్చోబెట్టి ప్రశ్నలు వెయ్యండి. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి. 95 శాతం మంది నన్ను ఇష్టపడతారు. 5 శాతం మంది ఇష్టపడతా లేదా అనేది వాళ్ళిష్టం. మనిషిగా నేను అందరిని సంతృప్తి పరచలేను. చాలా మందిని సంతృప్తి పరుస్తున్న కాబట్టి నాకు ఇండస్ట్రీలో ఈ రోజు మంచి పేరుంది. కానీ పనిగట్టుకొని నన్ను టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తున్నారు. అలాగే ఒక తమిళ్ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాను అని రాశారు. అందులో నిజం లేదు. ఇక ఇలాంటి ఫేక్ వార్తలపై సహించేది లేదు అంటూ దిల్ రాజు కాస్తా భావోద్వేగంతో, మరికాస్తా సీరియస్ టోన్ లోనే వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.