Begin typing your search above and press return to search.

దిల్ రాజు.. డబ్బింగ్ బంగారాలు!

టాలీవుడ్ లో బడా నిర్మాత దిల్ రాజుకి గత కొంతకాలం నుంచి మంచి రోజులు నడుస్తున్నాయని అనిపిస్తోంది

By:  Tupaki Desk   |   3 Dec 2023 6:10 AM GMT
దిల్ రాజు.. డబ్బింగ్ బంగారాలు!
X

టాలీవుడ్ లో బడా నిర్మాత దిల్ రాజుకి గత కొంతకాలం నుంచి మంచి రోజులు నడుస్తున్నాయని అనిపిస్తోంది. నిర్మాతగా ఆయన నుంచి పెద్దగా సినిమాలు రావడం లేదు. ఈ ఏడాది శాకుంతలం మూవీ దిల్ రాజు నుంచి వచ్చింది. ఆ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. అయితే పంపిణీదారుడుగా మాత్రం దిల్ రాజుకి అద్భుతమైన సమయం నడుస్తుందని చెప్పొచు.

లవ్ టుడే సినిమాని తక్కువ ధరకి కొనుగోలు చేసిన దిల్ రాజు భారీ లాభాలు ఆర్జించారు. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. దీని తర్వాత పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో లాభాలు రాకపోయిన నష్టాలు అయితే పెద్దగా రాలేదని చెప్పాలి. ఈ ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా అయితే దిల్ రాజుకి పంపిణీదారుడిగా భారీ లాభాలు తీసుకొచ్చింది.

ఇలా డబ్బింగ్ సినిమాలు అన్ని కూడా దిల్ రాజుకి డబ్బులు తెచ్చిపెడుతున్నాయని చెప్పొచ్చు. తాజాగా యానిమల్ మూవీకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా కూడా భారీ లాభాలు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే బింబిసార, మసూద సినిమాలని కూడా దిల్ రాజు డిస్టిబ్యూటర్ గా రిలీజ్ చేసి భారీ లాభాలు ఆర్జించారు.

నిర్మాతగా దిల్ రాజు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది క్లారిటీ లేదు. మరో వైపు ఆశీష్ హీరోగా ఒక సినిమా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతోంది. నిర్మాతగా ఈ మధ్యకాలంలో దిల్ రాజుకి భాగా లాభాలు తీసుకొచ్చిన సినిమా అంటే బలగం మాత్రమే అని చెప్పాలి.

అయితే డిస్టిబ్యూటర్ గా పక్కా ప్లానింగ్ తో సినిమాలని ఎంపిక చేసుకుంటూ డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలు సూపర్ సక్సెస్ అందుకుంటూ భారీ లాభాలు అందిస్తున్నాయి. ప్రభాస్ సలార్ సినిమాకి కూడా దిల్ రాజు పోటీ పడిన చివరి నిమిషంలో మైత్రీ మూవీ వారికి దానిని వదిలేశారు. మరి ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూడాలి.